24, నవంబర్ 2023, శుక్రవారం

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిన పని చేసేందుకు 13-10-2023 న ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుని మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు 27న కౌన్సెలింగ్

అనంతపురం(వైద్యం), న్యూస్టుడే: వైద్య విధాన పరిషత్ పరిధిలో వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిన పని చేసేందుకు 13-10-2023 న ఇచ్చిన నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకుని మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అనంతపురం లోని సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న వైద్యవిధాన పరిషత్ (డీసీ హెచ్ ఎస్) కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త డాక్టర్ పాల్ రవికుమార్ తెలిపారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల
వివరాలు http:///ananthapuramu.ap.gov.in వెబ్సైట్లో ఉంచటంతో పాటు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్కు తమ ఒరి
జినల్ విద్యార్హత సర్టిఫికెట్స్ తీసుకుని హాజరుకావాలని తెలిపారు.

+

కామెంట్‌లు లేవు: