24, నవంబర్ 2023, శుక్రవారం

12 బార్లకు నోటిఫికేషన్

అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 12 బార్ల వేలానికి ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. గురువారం నుంచి ఈనెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తా మని, 30న ఆన్లైన్ వేలం ప్రక్రియలో బార్లు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పుడు కేటాయించే బార్ లైసెన్సుల కాలపరిమితి రెండేళ్లుగా పేర్కొన్నారు. 50 వేల వరకు జనాభా ఉంటే రూ.5 లక్షలు. 50 వేల నుంచి 5 లకల జనాభాకు రూ.7.5 లక్షలు, 5లక్షలు దాటిన ప్రాంతాల్లో రూ.10 లక్షలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

12 బార్ల లైసెన్స్ల కోసం నోటిఫికేషన్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 బార్లకు వేలం ద్వారా లైసెన్సులు కేటాయించేందుకు ఎక్సైజ్
శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో నిర్వహించిన వేలంలో లైసెన్సులు
దక్కించుకుని, బిడ్డర్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ చార్జీలు, బిడ్ మొత్తం చెల్లించడంలో
విఫలమైన బార్లకు ప్రస్తుతం మరోసారి వేలం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం
ఈ నెల 23 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 30న ఆన్లైన్ ద్వారా వేలం ప్రక్రియ నిర్వహిస్తారు. వివరాల కోసం http://apcpe.aptonline.in వెబ్సైట్లో సంప్రదించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


కామెంట్‌లు లేవు: