వైద్యుల పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు Walk-in interviews for filling up the posts of doctors
వైద్య విధాన పరిషత్ (డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్) ఆధ్వర్యంలో పనిచేసే ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషాలిటీ వైద్యుల పోస్టులను శాశ్వత, ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు డిసెంబరు 11, 13, 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యాలయంలో జరగనున్నాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 11న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13న గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పెధాలజీ, 15న పీడియాట్రిక్స్, ఆర్గో, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయని, పూర్తి వివరాలు https://cfw.ap.nic.in వెబ్సైట్లో ఉన్నాయని తెలిపింది.
150 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వచ్చే నెల 11, 13, 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో ఏపీవీ వీపీ) ఆస్పత్రుల్లో 13 స్పెషాలిటీల్లో 150
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నామని బోర్డ్ మెంబర్ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెల 11వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, 13వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లి పాతూరు రోడ్డులోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://cfw.ap.nic.in/, http://hmfw.ap.gov.in/ వెబ్సైట్లను సందర్శించవచ్చు.
కామెంట్‌లు