నీట్-2024 సిలబస్ తగ్గింపు NEET-2024 Syllabus Reduction
నీట్-2024 సిలబస్ తగ్గింపు
» కెమిస్ట్రీ, బయాలజీలో కొన్ని చాప్టర్లు తొలగింపు!
న్యూఢిల్లీ, నవంబరు 22 : వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ -2024 పరీక్ష సిలబస్ ను ఎన్టీఏ తగ్గించింది. సీబీఎస్ఈ, ఇతర బోర్డులు తమ సిలబస్ చేసిన మార్పులకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. రసాయన శాస్త్రం(కెమిస్ట్రీ) నుంచి తొమ్మిది పాఠాలు, జీవశాస్త్రం(బయాలజీ) నుంచి తొమ్మిది పాఠాలను నీట్ సిలబస్ నుంచి తొలగించింది. విద్యార్థులు ఈ మార్పులను గమనించి పరీక్షకు సిద్ధం కావాలని కోరింది. అయితే, సిలబస్లో చేసిన ఈ అనవసర మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
యూజీ-2024 పరీక్ష వచ్చే ఏడాది మే 5న జరగనుంది.
నీట్
కామెంట్‌లు