IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)… 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ ‘ఒ’: 800 (ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ- 216, ఈడబ్ల్యూఎస్- 80, యూఆర్- 324)
2. ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్వో)(ఒప్పంద ప్రాతిపదికన): 1300 (ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ- 326, ఈడబ్ల్యూఎస్- 130, యూఆర్- 558)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు....
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.
ఆన్లైన్ పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30-12-2023.
కామెంట్లు