నేడు 'హార్టీకల్చర్' ఆఖరి విడత కౌన్సెలింగ్
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని తొమ్మిది ఉద్యాన కళాశాలల్లో బీఎస్సీ (హార్టీకల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఆఖరి విడత కౌన్సెలింగ్ శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని పరిపాలనా భవనంలో జరుగనుంది. గతంలో ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు కూడా హాజరుకావచ్చు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించి 100 సీట్లకు పైగా కౌన్సెలింగ్ జరుగుతుందని, ఇతర వివరాలకు ఉద్యాన వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చునని రిజిస్ట్రార్బి శ్రీనివాసులు పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి