అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
8, మే 2021, శనివారం
4, మే 2021, మంగళవారం
Tirupati jobs vacancy 2021 : పరీక్ష లేదు, తిరుపతిలో 410 ఉద్యోగాలు, వర్చ్యువల్ విధానంలో ఇంటర్వ్యూలు
APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అమర్ రాజా గ్రూప్స్ లిమిటెడ్స్, కరకంబాడి రోడ్ , తిరుపతి, చిత్తూరు జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | మే 8, 2021 |
వర్చ్యువల్ ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మే 11, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
మెషిన్ ఆపరేటర్స్ | 300 |
ఐటీఐ వెల్డర్స్ | 110 |
అర్హతలు :
10వ తరగతి లో ఉత్తీర్ణులు అయిన అభ్యర్థులు మరియు ఇంటర్, ఐటీఐ కోర్సులలో పాస్ /ఫెయిల్ అయిన అభ్యర్థులు అందరూ మెషిన్ ఆపరేటర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
10వ తరగతి /ఇంటర్ /ఐటిఐ (ఫిట్టర్ /టర్నర్ /మెషినిస్ట్ /ఎలక్ట్రికల్ /మెకానికల్ /ప్లాస్టిక్ )కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఐటిఐ వెల్డర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు .
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతం లభించనుంది.మరియు నైట్ అలోవెన్స్, అటెండెన్స్ అలోవెన్స్ కూడా లభించనున్నాయి.
మరియు ఈ జీతంతో పాటు భోజన మరియు వసతి సౌకర్యాలలో రాయితీ కల్పించబడుతుంది.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
8247766099
1800-425-2422
2, మే 2021, ఆదివారం
Defence Services Jobs 2021 || డిఫెన్స్ సర్వీస్ లో వివిధ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు:
83
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి 21 రోజుల లోపు అని చెప్పడం జరుగుతుంది.
విభాగాల వారీగా ఖాళీలు:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 | 4 |
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి | 10 |
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) | 7 |
సుఖాని | 1 |
వడ్రంగి | 1 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్ | 60 |
లెవల్స్:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 | Level 4 |
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి | Level 2 |
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) | Level 2 |
సుఖాని | Level 2 |
వడ్రంగి | Level 2 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్ | Level 1 |
జీతం:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 | 25500-81100 |
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి | 19900-63200 |
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్) | 19900-63200 |
సుఖాని | 19900-63200 |
వడ్రంగి | 19900-63200 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్ | 18000-56900 |
వయస్సు:
పోస్ట్ ని బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
1, మే 2021, శనివారం
DFCCIL Recruitment | భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల భర్తీ, 1074 రైల్వే పోస్టులు
భారీ స్థాయిలో జీతం లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటనలో పొందుపరిచారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | మే 23, 2021 |
CBT పరీక్ష నిర్వహణ తేది | జూన్ 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ మేనేజర్ (సివిల్ ) | 31 |
జూనియర్ మేనేజర్ (ఆపరేషన్స్ & BID) | 77 |
జూనియర్ మేనేజర్ (మెకానికల్ ) | 3 |
ఎగ్జిక్యూటివ్ (సివిల్ ) | 73 |
ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ) | 42 |
ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ & టెలి కమ్యూనికేషన్ ) | 87 |
ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్ & BD) | 237 |
ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ) | 3 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ) | 135 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ &టెలి కమ్యూనికేషన్ ) | 147 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్ & BD) | 225 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ) | 14 |
అర్హతలు :
జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బాచిలర్ డిగ్రీ /బీఈ /బీ. టెక్ /ఎంబీఏ /పీజీడీజీఏ /పీజీడీబీఎం /పీజీడీఎం మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో 10వ తరగతి మరియు ఐటీఐ కోర్సులను కంప్లీట్ చేసిన వారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఈ పోస్టుల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .
ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు .
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఉద్యోగాల విభాగాలను అనుసరించి 700 – 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను .
ఎస్సీ /ఎస్టీ మరియు అన్ని కేటగిరిలకు చెందిన మహిళా అభ్యర్థులకు ఎటువంటి ధరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు (CBT) మరియు ఇంటర్వ్యూల విధానాల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,500 రూపాయలు నుండి 1,95,000 రూపాయలు వరకూ లభించనున్నాయి.
29, ఏప్రిల్ 2021, గురువారం
ఎస్‌బీఐలో 5454 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. Closure of registration of application 20/05/2021

మొత్తం పోస్టుల సంఖ్య: 5454 (రెగ్యులర్–5000, బ్యాక్‌లాగ్– ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ –121, పీడబ్ల్యూడీ–96, ఎక్స్‌సర్వీస్‌మెన్–237).
హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 275.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1993 –01.04.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష : ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు.
మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2గంటల 40నిమిషాలు.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021
ప్రిలిమినరీ పరీక్ష : జూన్ 2021లో జరుగుతుంది.
మెయిన్ పరీక్ష తేది: 31.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bank.sbi/careers
State Bank SBI Clerk Recruitment 2021 Apply Online for 5000 Post | Closure of registration of application 20/05/2021
ఐఐఐటీడీఎం, కర్నూలులో 10 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది మే 15..

పోస్టుల వివరాలు:ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్– 05, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్– 01, మెకానికల్ ఇంజనీరింగ్–02, సైన్సెస్–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: దీన్ని రెండు విధాలుగా నిర్వహిస్తారు. అవి.. సెమినార్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. కొన్ని విభాగాలు స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. మొదటగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల్ని సెమినార్‌కి పిలుస్తారు. సెమినార్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారిని ఇంటర్వూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.05.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iiitk.ac.in
ఏఎన్‌జీఆర్‌ఏ యూనివర్శిటీ, గుంటూరులో 149 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది మే 23..

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–06, అసోసియేట్ ప్రొఫెసర్–34, అసిస్టెంట్ ప్రొఫెసర్–109.
విభాగాలు: అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్(హోమ్ సైన్స్).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూనివర్శిటీ నిబంధనల ప్రకారం–అర్హత ప్రమాణాలు ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.05.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.angrau.ac.in
28, ఏప్రిల్ 2021, బుధవారం
నేవీలో 2500 సెయిలర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021

కోర్సు ప్రారంభం: ఆగస్టు 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 2500(ఏఏ–500, ఎస్‌ఎస్‌ఆర్–2000).
ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ): 500
అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.
సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్‌ఎస్‌ఆర్)–2000
అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌చేస్తారు. మొత్తం 2500 సెయిలర్ పోస్టులకు దాదాపు 10వేల మందిని రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టుకు పిలుస్తారు.
పరీక్ష విధానం..
ప్రశ్న పత్రం హిందీ/ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ప్రశ్న పత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అదే రోజు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తిచేయాలి. అలాగే 20 ఉటక్ భైటక్, 10 ఫుష్ అప్స్‌చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in/
ఐడీబీఐలో వివిధ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేది మే 3..

పోస్టుల వివరాలు: చీఫ్ డేటా ఆఫీసర్–01, హెడ్–ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ –ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కాంప్లియన్స్–01, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(ఛానల్స్)–01, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(డిజిటల్)–01, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్–01, హెడ్–డిజిటల్ బ్యాంకింగ్–01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitment@idbi.co.in
దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.idbibank.in
ఆర్మీ డెంటల్ కాఫ్స్‌లో 37 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు.. దరఖాస్తుకు చివరి తేది మే 18..

మొత్తం పోస్టుల సంఖ్య: 37
అర్హత: బీడీఎస్(చివరి ఏడాది బీడీఎస్‌లో కనీసం 55శాతం మార్కులు సాధించాలి)/ఎండీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. 31.03.2021 నాటికి ఏడాదిపాటు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: నీట్(ఎండీఎస్)–2021 ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 18.05.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
డీఎఫ్‌సీసీఐఎల్‌లో 1074 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది మే 23..

పోస్టుల వివరాలు: జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
విభాగాలు: సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ తదితరాలు.
అర్హతలు:
జూనియర్ మేనేజర్: సంబంధిత విభాగాన్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ(సివిల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/మెకట్రానిక్స్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ ఆటోమొబైల్/ కంట్రోల్/ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్), ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.50వేల నుంచి 1,60,000 వరకూ లభిస్తుంది.
ఎగ్జిక్యూటివ్: సంబంధిత విభాగాన్ని అనుసరించి డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/పవర్ సప్లయ్/ఇండస్ట్రియల్/ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్/ కమ్యూనికేషన్/డిజిటల్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్) ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.30వేల నుంచి రూ.1,20,000 వరకూ లభిస్తుంది.
జూనియర్ ఎగ్జిక్యూటివ్: 10వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ.25వేల నుంచి రూ.68వేల వరకూ అందుతుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్/ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.05.2021
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: జూన్ 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dfccil.com/
AP Mineral Development Corporation || 1 లక్ష రూపాయిలు జీతం ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
కేవలం ఈ మెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
AP Mineral Development Corporation
ముఖ్యమైన తేదీలు :
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది | మే 22, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ ) | 1 |
జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ ) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్విరాన్మెంటల్ ) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (కాంట్రాక్టు మేనేజ్మెంట్ ) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (F&A /టాక్సషన్ ) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (CSR) | 1 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ ) | 1 |
మేనేజర్ (సర్వే /GIS) | 1 |
మేనేజర్ (ఫైనాన్స్ ) | 4 |
మేనేజర్ (కాంట్రాక్టు అడ్మిన్ ) | 1 |
మేనేజర్ (ఐటీ ) | 1 |
మేనేజర్ (మైనింగ్ ) | 3 |
మేనేజర్ (కంపెనీ సెక్రటరీ ) | 1 |
అర్హతలు :
సంబంధిత విభాగాల ఉద్యోగాలను అనుసరించి డిప్లొమా (సివిల్ /మైనింగ్ )/బీ. టెక్ (ఐటీ )/ మైనింగ్ ఇంజనీరింగ్/ బీ. కామ్/సీఏ /ఎంబీఏ (మార్కెటింగ్ /ఫైనాన్స్ )/ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబందించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు పైన జీతముగా లభించనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
apmdchrdrecruitments@gmail.com
Tirupati latest jobs || పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాలు, 3- 5 లక్షల వరకూ జీతం
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.
APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయబోతున్న ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేయనున్నారు.
భారీ స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఏప్రిల్ 29, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్, చెల్ల కాంప్లెక్స్, 6-1-68/B-1, కే. టీ. రోడ్, తిరుపతి – 517501.
విభాగాల వారీగా ఖాళీలు :
ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్స్ | 5 |
ఏజెన్సీ మేనేజర్స్ | 20 |
అర్హతలు :
గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.సంబంధిత విభాగాలలో 3-6 సంవత్సరాలు అనుభవం అవసరం.
ఆర్మీ /నేవీ /ఎయిర్ ఫోర్స్ /రిటైర్డ్ /వీఆర్ఎస్ /ఫార్మా /బ్యాంకింగ్ /ఫైనాన్స్ /సేల్స్ పీపుల్ తదితర రంగాలలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఇంటర్మీడియట్ మరియు ఆపైన అర్హతలు కలిగి ఉన్నావారు ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
హోం మేకర్స్ /చిట్ ఓనర్స్ /రిటైర్డ్ /వీఆర్ఎస్ /ఫైనాన్స్ /డిస్ట్రిబ్యూషన్ /అన్ ఎంప్లాయిస్ /డీఎస్ఏ /డీఎంఏ /లోన్ ఎగ్జిక్యూటివ్స్ తదితరులు అందరూ ఈ ఏజెన్సీ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనీ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.
వయసు :
ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్స్ ఉద్యోగాలకు 30నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు 30 నుండి 70 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఏజెన్సీ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 3నుండి 5 లక్షల రూపాయలు వరకూ జీతం లభించనున్నది.
మరియు ఇన్సెంటివ్స్ +బోనస్ +ప్రొవిడెంట్ ఫండ్ + ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ లాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
ఏజెన్సీ మేనేజర్స్ పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ +బోనస్ +కెరీర్ గ్రోత్ ప్రమోషన్స్ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
7799300659
8374421195
1800-425-2422
27, ఏప్రిల్ 2021, మంగళవారం
SBI Recruitment for 5000 Junior Associates in Customer Support & Sales departments.
ఎస్బిఐ(SBI) రిక్రూట్మెంట్- 5000 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)
🧩 క్వాలిఫికేషన్: గ్రాడ్యుయేట్
⚜️ పే స్కేల్: రూ .17,900-47,920
🎗️ వయోపరిమితి: 01/04/2021 నాటికి 20-28 సంవత్సరాలు
ఆన్‌లైన్ నమోదు ప్రారంభ తేదీ- 27/04/2021
SBI- Central Recruitment & Promotion Department Recently announced 5000 Job vacancies for s Junior Associate (Customer Support & Sales) in clerical cadre. The candidates applying for this job, should be proficient in reading, writing, speaking and understanding in the specified opted local language of that State. Telangana candidates should be proficient in Telugu/Urdu language.
Post Name: Junior Associates (Customer Support & Sales)
No of Vacancies: 5,000 Posts, following are the SBI circle wise job vacancies.
- Telangana (Hyderabad)- 275 Posts
- Ahmedabad- 902 Posts
- Bangalore- 400 Posts
- Bhopal- 198 Posts
- Bengal- 302 Posts
- Bhubaneswar- 75 Posts
- Chennai- 554 Posts
- Delhi- 150 Posts
- Haryana- 110 Posts
- Jaipur- 157 Posts
- Kerala- 100 Posts
- Lucknow- 350 Posts
- Maharashtra- 650 Posts
- North Eastern- 220 Posts
Education Qualification for SBI JA: Graduation from recognized University.
Job Location: All over India
Pay Scale:Rs.17,900-47,920 and benefits like increments, D.A., other allowances.
Probation Period: Minimum period of 6 months. Newly recruited Junior Associates will be required to complete e-lessons
Age Limit: 20-28 years as of 01-04-2021, Age relaxation for SC/ST- 5Yrs, OBC- 3Yrs, PWD-10 to 13 Yrs,
Important Dates:
- Online Registration start date- 27/04/2021
- Online Registration last date- 17/05/2021
- Preliminary Examination tentatively scheduled in June 2021
- Main Examination will be conducted tentatively on 31.07.2021
Selection Process:- The selection process will consist of on-line test (Preliminary & Main exam) and test of specified opted local language.
- Phase-I: Preliminary Examination contains Online Objective Test for 100 Marks (1 Hr. Duration).
- Phase - II: Main Examination contains Online Main Exam for 200 Marks (2 Hrs. 40 Min).
Process to Apply:
Candidates for SBI Recruitment for Junior Associates will be required to register themselves online through Bank's website https://banksbilcareers or https://www.sbi.co.in/careers . After registration candidates are required to pay the requisite application fee through online mode by using debit card/credit card/Internet Banking.
Fee Structure: SC/ ST/ PWD/ XS/DXS- No fee payment and for General/ OBC/ EWS- 750/-
Helpdesk: telephone no. 022-22820427, https://cgrs.ibps.in.
PAYMENT
OF FEES: [ONLINE MODE ONLY]: Candidates should first scan their
photograph and signature as detailed under guidelines for scanning the
photograph and signature. Candidates should have valid email ID &
mobile no. which should be kept active till the declaration of results.
It will help him/ her in getting call letter/ advices etc. by email/
SMS. Please find Latest SBI jobs at https://www.sbi.co.in/web/
Post Details |
Links/ Documents |
Official Notification | Download |
Online Application | Click Here |
26, ఏప్రిల్ 2021, సోమవారం
ఏపీలో లైన్‌మెన్ కొలువులు.. దరఖాస్తుకు చివరి తేది 03.05.2021

అర్హతలు..
జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ (ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్)లో ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 31.01.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్(పోల్/టవర్ క్లైబింగ్ టెస్ట్), మీటర్ రీడింగ్ టెస్టుల ద్వారా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష..
పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
పోల్ క్లైబింగ్..
పోల్ క్లైబింగ్ టెస్ట్‌లో భాగంగా.. 15 నిమిషాల వ్యవధిలో పోల్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించి.. పోల్ క్లైబింగ్‌లో విఫలమైతే ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తారు.
మీటర్ రీడింగ్..
రాత పరీక్షతోపాటు పోల్‌క్లైబింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో మీటర్ రీడింగ్ పరీక్షలకు పిలుస్తారు.
ఎంపిక తర్వాత..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15000 చొప్పున వేతనంగా అందిస్తారు. వీరు గ్రామ పంచాయతీ/వార్డులలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్/వార్డు సెక్రటేరియట్స్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, అలాగే ఎస్సీ/ఎస్టీ వారు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి: 03.05.2021
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...