19, జనవరి 2025, ఆదివారం

GST Update ఎక్స్‌ వర్క్స్‌ కాంట్రాక్టుల్లో ఐటీసీ ఎప్పుడు తీసుకోవాలి ? When Should ITC Be Claimed in Ex-Works Contracts?

ఎక్స్‌ వర్క్స్‌ కాంట్రాక్టుల్లో ఐటీసీ ఎప్పుడు తీసుకోవాలి ?

నిర్మాణ రంగంలో ఉన్న ఒక ప్రముఖ కంపెనీ తాను నిర్మించబోయే వాణిజ్య సముదాయానికి కావాల్సిన సిమెంట్‌, స్టీల్‌, ఇతర ఇన్‌పుట్స్‌ను నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయాలని భావించింది. దీనివల్ల స్థానిక మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకే తనకు కావాల్సిన ఇన్‌పుట్స్‌ను కొనవచ్చని భావించింది. అనుకున్న విధంగానే ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కావాల్సిన సరుకును ఆయా ఫ్యాక్టరీల నుంచి నేరుగా పొందేట్లుగా ఎక్స్‌ వర్క్స్‌ కాంట్రాక్టు రాసుకున్నారు. దీని ప్రకారం ఫ్యాక్టరీ నుంచి నిర్మాణ స్థలానికి మధ్య జరిగే రవాణా, బీమా ఇతరత్రా ఖర్చులను కొనుగోలుదారుడే భరించాలి.

ఎక్స్‌వర్క్స్‌ అంటే అమ్మకపుదారుడు తన ఉత్పత్తిని కొనుగోలుదారునికి తన ఫ్యాక్టరీ గేటు దగ్గరే అందిస్తున్నట్లు లెక్క. కాబట్టి తదుపరి ఖర్చు మొత్తం కొనుగోలుదారుడే భరించాలి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఎక్స్‌ వర్క్స్‌ అంటే కేవలం రవాణా లాంటి ఖర్చు మాత్రమే కాదు. ఆ సరుకుకు సంబంధించిన పూర్తి యాజమాన్య హక్కులు కూడా కొనుగోలుదారునికి ఫ్యాక్టరీ గేటు దగ్గరే బదిలీ అవుతాయి. అంటే, ఒకసారి ఆ సరుకు ఫ్యాక్టరీ గేటు దాటితే.. ఆ సరుకుకు సంబంధించిన పూర్తి బాధ్యత కొనుగోలుదారునిదే. అమ్మకందారునికి ఎలాంటి బాధ్యత ఉండదు.

పైన చెప్పిన ఉదాహరణలో ఆ నిర్మాణ సంస్థ తనకు కావాల్సిన ఉత్పత్తులు స్థానికంగా లభ్యమైనప్పటికీ తక్కువ ధరకు పొందాలనే ఉద్దేశంతో నేరుగా ఫ్యాక్టరీ నుంచి కాంట్రాక్టు కుదుర్చుకుంది. నిజానికి ఇక్కడ ఎక్స్‌ వర్క్స్‌ అనేది తప్పనిసరి కాదు. రవాణా, ఇతర ఖర్చులు కలిపినా తనకు స్థానిక ధరలతో పోలిస్తే తక్కువకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా కాంట్రాక్టు కుదుర్చుకుంది.

కొన్ని వ్యాపారాలకు తప్పనిసరి

అయితే, కొన్ని రకాల వ్యాపారాల్లో ఎక్స్‌ వర్క్స్‌ కాంట్రాక్ట్‌ అనేది తప్పనిసరి. ఉదాహరణకు ఆటోమొబైల్‌ రంగం. ఒక కారు డీలర్‌ తనకు కావాల్సిన కార్లను తప్పనిసరిగా ఎక్స్‌ వర్క్స్‌ ప్రాతిపదికనే కొనాలి. అంటే, కార్ల తయారీదారు, ఆ కారు డీలర్‌ కొనుగోలు చేసిన కార్లను ఎక్స్‌ వర్క్స్‌ ప్రాతిపదికన అంటే ఫ్యాక్టరీ గేటు దగ్గరే అందిస్తాడు. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేసిన కార్ల తాలూకు యాజమాన్య హక్కులు.. డీలర్‌ వేర్‌ హౌస్‌కో, షోరూమ్‌కో కార్లు చేరుకున్నప్పుడు కాకుండా కార్ల తయారీ స్థలంలోనే అంటే ఫ్యాక్టరీ గేటు దగ్గరే ఆ డీలర్‌ పొందుతాడు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న డీలర్‌ చెన్నైలోని ప్లాంట్‌లో కార్లు కొనుగోలు చేశాడు. రవాణాకు ఒక ఐదారు రోజుల సమయం పడుతుందని అనుకుందాం. అంటే జనవరి నెలాఖరులో కార్లు కొనుగోలు చేస్తే.. ఆ కార్లు డీలర్‌ దగ్గరకు చేరే సరికి జనవరి నెల పూర్తయి ఫిబ్రవరి మొదలవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జీఎస్‌టీకి సంబంధించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందటానికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఐటీసీ నిబంధనల ప్రకారం ఒక వస్తువు మీద క్రెడిట్‌ తీసుకోవాలంటే ఆ వస్తువును కొనుగోలుదారుడు కచ్చితంగా పొంది ఉండాలి. అంటే, రిసీవ్‌ చేసుకుని ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ కారు డీలర్‌ తాను కొనుగోలు చేసిన కార్లను ఎప్పుడు రిసీవ్‌ చేసుకున్నట్లు భావించాలి? వాటి మీద ఎప్పుడు క్రెడిట్‌ తీసుకోవాలి? కారు భౌతికంగా తన షోరూమ్‌లో పొందినది ఫిబ్రవరిలో కాబట్టి కార్లను అదే నెలలో పొందినట్లు భావించి ఫిబ్రవరి నెల రిటర్న్‌లో క్రెడిట్‌ తీసుకోవాలా? లేదా తనకు యాజమాన్య హక్కులు జనవరిలోనే బదిలీ అయ్యాయి కాబట్టి, జనవరిలోనే తాను కార్లు పొందినట్లు భావించి సంబంధిత ఐటీసీ జనవరి నెల రిటర్న్‌లో తీసుకోవాలా ? ఇలాంటి గందరగోళం ఎక్స్‌ వర్క్స్‌ లావాదేవీల్లో ఉండేది.

స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

ఈ గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. దీని ప్రకారం, వస్తువులను రిసీవ్‌ చేసుకోవటం అంటే భౌతికంగా వస్తువులను పొంది ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ వర్క్స్‌ ప్రాతిపదికన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు.. ఆ వస్తువుల మీద సర్వ హక్కులు కొనుగోలుదారునికి ఫ్యాక్టరీ గేటు దగ్గరే సంక్రమిస్తాయి. కాబట్టి ఆ క్షణమే అతను ఆ వస్తువులను రిసీవ్‌ చేసుకున్నట్లు భావించాలి. ఐటీసీకి సంబంధించిన ఇతర నియమ నిబంధనలు సరిగ్గా ఉన్నట్లయితే, పైన చెప్పిన ఉదాహరణలో కారు డీలర్‌ తాను కొనుగోలు చేసిన కార్ల తాలూకు క్రెడిట్‌ జనవరి నెల రిటర్నులోనే తీసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణతో ఎక్స్‌ వర్క్స్‌ కాంట్రాక్టుల్లో ఐటీసీ తీసుకోవటానికి స్పష్టత లభించింది.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

When Should ITC Be Claimed in Ex-Works Contracts?

A leading construction company planned to procure cement, steel, and other inputs directly from manufacturers to save costs compared to local market prices. After negotiations with the suppliers, the company entered into Ex-Works contracts, where the buyer bears transportation, insurance, and other costs from the factory to the construction site.

What is Ex-Works?

Under Ex-Works terms, the seller delivers the goods at their factory gate. Once handed over, all further costs and risks, including ownership of the goods, are transferred to the buyer. Essentially, after the goods leave the factory gate, any responsibility for damage or loss lies solely with the buyer.

Practical Example

In this scenario, although the company could locally procure materials, it opted for Ex-Works contracts due to lower overall costs, even after accounting for transportation and other expenses.

Essential for Certain Businesses

Some industries, like automobile dealerships, must operate under Ex-Works contracts. For instance, a car dealer in Hyderabad purchasing cars from a Chennai plant would receive ownership of the cars at the factory gate, not when they physically arrive at their showroom.

This setup raises a question about Input Tax Credit (ITC):
When should ITC be claimed—upon ownership transfer at the factory gate (e.g., January) or when the goods are physically received at the showroom (e.g., February)?

Clarification from the Government

To address this confusion, the government issued a circular specifying that "receiving goods" does not necessarily mean physical receipt. For Ex-Works transactions, ownership transfers at the factory gate, and the buyer is deemed to have received the goods at that point. Consequently, ITC can be claimed in the same month as the ownership transfer if all other ITC conditions are met.

Key Takeaway

For Ex-Works contracts, ITC can be claimed when ownership rights transfer, irrespective of when the goods physically arrive. Businesses should ensure compliance with ITC rules for accurate reporting.




 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు లేవు: