ఎస్వీయూ దూరవిద్య 2021 నోటిఫికేషన్ విడుదల యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య విభాగం కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ ప్రకటన విడుదలైంది.
అడ్మిషన్ షెడ్యూల్, ఇంన్ఫర్మేషన్ బ్రోచర్‌ను వీసీ ప్రొఫెసర్ కే
రాజారెడ్డి సోమవారం తన చాంబర్‌లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్వీయూ
దూరవిద్య విభాగం ద్వారా 19 పీజీ, 5 యూజీ, 2 డిప్లమో కోర్సులు
అందిస్తున్నామన్నారు. ఈ నెల 7వతేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చేయవచ్చని తెలిపారు. ఆగస్టు 31లోపు ఫీజు చెల్లించి సెప్టెంబర్ 6 లోపు
దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఎలాంటి విద్యార్హత లేని
వారు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చన్నారు.
వారికి ఆగస్టు 29న అర్హత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 9705105270,
9177220642లో సంప్రదించాలని సూచించారు. రెక్టార్ జీఎం సుందరవల్లి,
రిజిస్ట్రార్ ఓ.మహ్మద్ హుస్సేన్, దూర విద్య విభాగం డైరెక్టర్ ఎస్వీ
సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
కామెంట్‌లు