22, జూన్ 2021, మంగళవారం

Vacancies in Sakshi

We are Hiring

Sakshi is a leading Telugu newspaper with 20 editions. In 2007, we were brave to be the first regional news paper, designed in colour and launched simultaneously in 23 editions across Andhra Pradesh and Telangana and Metro cities (Delhi, Mumbai, Bangalore and Chennai).

At Sakshi we believe that every challenge is an opportunity to change old paradigms and crave the path to a new tomorrow. The Sakshi Media Group is a 360 degree media conglomerate across print, television, digital and activation domains. Its decade long journey has been marked by innovation and courage since its inception.

If you are looking for an exciting career, Send us your resume to recruitments@sakshi.com (or) WhatsApp to 9010007856 mentioning the role on subject line.

 

1) for PHP Developer  

Responsibilities
  • Create web applications/web services using PHP technology on Linux/Windows based environments.
  • Required knowledge of AJAX, JavaScript, CSS.
  • Good knowledge of database software like MYSQL
  • Working experience in Drupal CMS is a must.
  • Frame work knowledge required on Codeigniter, Laravel .
  • Ability to work independently in a fast-paced, rapidly changing environment.
  • Strong written and oral communication skills are required.
  • Prepare and maintain all applications utilizing standard development tools
Key skills required
  • Experience 5 to 7 years in web and mobile app development,maintenance
  • Web technologies: PHP, HTML, XML, CSS, Bootstrap, Java script, JQuery, NodeJS,
  • Database technologies: MySql
  • Frameworks: Codeigniter, Laravel
  • Content Management Systems: Drupal, WordPress
  • Web servers: Apache, Nginx,
  • Servers: Ubuntu, Linux, Windows
Education
  • Any Graduate
2) Video Editor
 
Responsibilities
  • You work on unaired content to create new YouTube specific videos
  • News- Govt. Speeches, rallys, additional trending news footage, etc.
  • Entertainment - Celeb Interviews, Programs, etc.
  • Very Strong Video Editing skills to create video output on your own.
  • Proven work experience as a video editor
  • Fluency in Telugu and English Language – Should be able to read, write and speak
  • Basic knowledge of current news across local, national and international
  • Should be able to adapt fast paced video creation and uploading process
  • Good communication skills
Key skills required
  • Experience 3 to 5 years of relevant area
  • Strong exposure in AVID Software, Photoshop & Premiere Pro
  • Good experience in working with YouTube, Website and other Social media platforms
Education
  • Any Graduate

3) Voice over Artist

Responsibilities
  • Required to create new videos and lend good voice over to visuals
  • Produce quality recordings as well as videos for website
  • Lend to voice for photo video galleries, viral videos and podcast
  • Ready to went reporting and take videos of different concepts
  • Comfortable yet professional presence on camera
  • Maximize the video uploads per day by coordinating with content team
  • Work with Sales team to leverage adverts on video content
  • Work with Marketing team to understand the insights to improve Views and watch time
  • Required to coordinate to create new video of gadgets, automobile, cookery etc
Key skills required
  • Good Voice Modulation and Correct Diction
  • Fluency in Telugu and English Language – Should be able to read, write and speak
  • Basic knowledge of current news across local, national and international
  • Languages, accents, and dialects can fluently perform
  • Good communication and Reporting skills
  • Passion about writing and creating interesting video stories
  • Strong knowledge of digital media processes
Education
  • Any Graduate 
4) Social Media Executive
 
Responsibilities
  • Contribute to and influence the direction of social media strategy
  • Design and execute marketing campaigns
  • Analyze and report on the search performance
  • Provide an SEO prospective on content creation and social media
  • Work closely with the SEO, online marketing and affiliate marketing teams to help co-ordinate all integrated online output
  • Responding to mentions over social media platforms like Facebook, Twitter, Instagram etc and engage with the social media users
  • Monitors and develops reports on competitor activity within social media spaces
Key skills required
  • Experience 2 to 5 years of relevant area
  • Hands on experience in video editing and content management
  • Knowledge of online marketing channels
Education
  • Any Graduate
5) Senior Sub Editor
 
Responsibilities
  • Should follow the guidelines of the desk and work in different shifts
  • Should have knowledge to create content for web reader specific
  • Ensure that articles are written in accordance with the style guide of Sakshi
  • Create content by following word count formulas
  • Able to work under tight deadlines with speed and style
  • Liaising with colleague / editorial and other staff / having good communication skills
  • Keeping up to date with the concerned issues / developments
Key skills required
  • Experience 4 to 7 years of work experience from a reputed news paper or digital media
  • One should have writing, rewriting, editing skills and knowledge on digital media
  • Capable to do translation from English to Telugu
  • Knowledge over CMS / URLs / Tags / Meta Tags / SEO & Social Media and Apps
  • Knowledge over Industries like - Technology / Automobile / Consumer / Electronic & Telecom
  • Comprehensive knowledge over consumer electronics /products / e-commerce / online services
  • Capable of comparing the products mainly Gadgets / Mobiles / Small Screen World / Appliances
  • Knowledge on making Video stories on products launch / product comparison / product featuring / Upcoming Innovations
  • Fluent in Telugu, English
Education
  • Graduation and Journalism Degree from any recognized university is preferable.

21, జూన్ 2021, సోమవారం

ఇండియన్‌ ఆర్మీ, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ కోర్సు..ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

 



ఇండియన్‌ ఆర్మీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ల నియామకానికి.. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 50వ కోర్సు(అక్టోబర్‌ 2021) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
Jobs  
మొత్తం ఖాళీల సంఖ్య: 55
ఖాళీల వివరాలు: ఎన్‌సీసీ మెన్‌–50(జనరల్‌ కేటగిరి–45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–05); ఎన్‌సీసీ విమెన్‌–05(జనరల్‌ కేటగిరి–04, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–01).
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వీరికి ఎన్‌సీసీ సీ సర్టిఫికేట్‌ ఉండాల్సిన అవసరం లేదు.
వయసు: ఎన్‌సీసీ అభ్యర్థులకు(యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందిని కలుపుకొని)01.07.2021 నాటికి 19–25ఏళ్ల మధ్య ఉండాలి. 02 జూలై 1996 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ్య నిర్వహిస్తారు. ఇది రెండు ఫేజ్‌లుగా ఉంటుంది. ఫేజ్‌–1, ఫేజ్‌–2 పరీక్షలు ఉంటాయి. ఫేజ్‌–1లో ఫెయిల్‌ అయిన అభ్యర్థులను ఫేజ్‌–2కు ఎంపిక చేయరు. వారు అదే రోజు తిరిగి వెళ్లొచ్చు. ఫేజ్‌–1లో ఎంపికైన అభ్యర్థులకు ఫేజ్‌–2 ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి చివరగా మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

18, జూన్ 2021, శుక్రవారం

ఎన్‌ఐవీఈడీఐ, బెంగళూరులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది: 18.06.2021

 



బెంగళూరులో ఐకార్‌ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేటిక్స్‌(ఎన్‌ఐవీడీఐ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
 Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్, జూనియర్‌రీసెర్చ్‌ ఫెలో,సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, ల్యాబ్‌ అసిస్టెంట్,ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ తదితరాలు.

రీసెర్చ్‌ అసోసియేట్‌: సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్‌డీ, ఎంవీఎస్సీ/ఎంఫార్మసీ /ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.54,000 వరకు చెల్లిస్తారు.

జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: పీజీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/సీఎస్‌ఐఆర్‌ యూజీసీ, గేట్‌ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.

ల్యాబ్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.20,000 వరకు చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21–50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం నెలకు రూ.20,000 వరకు చెల్లిస్తారు.

సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.

యంగ్‌ ప్రొఫెషనల్స్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం నెలకు రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.06.2021
ఇంటర్వూ తేది: 23, 24.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://nivedi.res.in/

ఎన్‌ఐడీ, ఏపీలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021

 



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరులో భారత ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ ఆంధ్రప్రదేశ్‌(ఎన్‌ఐడీఏ).. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్‌–01, హెడ్‌ లైబ్రేరియన్‌–01, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–01, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌–02.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 16.06.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.nid.ac.in

పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021


భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక పరిధిలోని సదరన్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌.. డిప్లొమా ట్రెయినీ పోస్టుల ¿¶ ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 35;
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్‌. డిప్లొమా ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)–30, డిప్లొమా ట్రెయినీ(సివిల్‌)–05.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.powergrid.in

16, జూన్ 2021, బుధవారం

ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021

 



ఇండియన్‌ నేవీ.. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌(ఎస్‌ఎస్‌సీ)–50(ఎస్‌ఎస్‌సీ జనరల్‌ సర్వీస్‌(జీఎస్‌/ఎక్స్‌)–47, హైడ్రో కేడర్‌–03).

కోర్సు ప్రారంభం: జనవరి 2022
శిక్షణ కేంద్రం: ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక విధానం: కోవిడ్‌–19 కారణంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించకుండా.. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్టింగ్‌ చేయనున్నారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ్య, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Selected Java Interview Questions

Java Interview Question
https://www.k2atech.in/p/java-interview-question.html

Most Important Program In Java for Interview
https://www.k2atech.in/p/blog-page_19.html

Array Interview Question
https://www.k2atech.in/p/top-50-java-array-interview-questions.html

Exception Handling Interview Question
https://www.k2atech.in/p/30-most-asked-java-exception-handling.html

Collection Interview Question
https://www.k2atech.in/p/1-what-is-collection-framework-in-java.html

JDBC Interview Questions
https://www.k2atech.in/p/jdbc-interview-questions-list-of-top.html

Hibernate Interview Questions
https://www.k2atech.in/p/hibernate-interview-questions-hibernate.html

Servlet Interview Question
https://www.k2atech.in/p/1-how-many-objects-of-servlet-is.html

JSP Interview Questions
https://www.k2atech.in/p/jsp-interview-questions-there-is-list.html

Java Practice Set's
https://www.k2atech.in/p/java-online-training-course-content.html

15, జూన్ 2021, మంగళవారం

యూఓహెచ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021



హైదరాబాద్‌(గచ్చిబౌలి)లోని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్‌ మేనేజర్లు–03, ఆఫీస్‌ అటెండెంట్‌–01.

ప్రోగ్రామ్‌ మేనేజర్లు:
అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్‌/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ విభాగాల్లో పని అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి.
వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఆఫీస్‌ అటెండెంట్‌:
అర్హత:
సెకండరీ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఆఫీస్‌ అటెండెంట్‌గా పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్‌ చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్, ఐఓఈ డైరెక్టరేట్, డా.జాకీర్‌ హుస్సేన్‌ యూపీఈ లెక్చర్‌ హాల్‌ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్‌ సీఆర్‌రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌–500046 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://uohyd.ac.in

ఆంధ్రప్రదేశ్‌లో 453 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు..ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021



ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన 453 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
పోస్టులు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌లు.
మొత్తం పోస్టుల సంఖ్య: 453
పోస్టుల వివరాలు: గైనకాలజీ–269, పీడియాట్రిక్స్‌–11, అనెస్తీషియా–64, జనరల్‌ మెడిసిన్‌–30,జనరల్‌ సర్జరీ–16, ఆర్థోపెడిక్స్‌–12, పాథాలజీ–05, ఆప్తాల్మాలజీ–09, రేడియాలజీ–21, సైకియాట్రీ–02, డెర్మటాలజీ–06, ఈఎన్‌టీ–08.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మెడికల్‌ కౌన్సెల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్‌ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్, గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in

KCET 2021-2022 NOTICE

 


ఇండియన్‌ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు..దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021

 



భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ల్లో నావిక్‌ (జనరల్‌ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌), యాంత్రిక్‌ 01/2022 బ్యాచ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 350
పోస్టుల వివరాలు: నావిక్‌(జనరల్‌ డ్యూటీ)–260, నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌)–50, యాంత్రిక్‌(మెకానికల్‌)–20, యాంత్రిక్‌(ఎలక్ట్రికల్‌)–13, యాంత్రిక్‌(ఎలక్ట్రానిక్స్‌)–07.
అర్హతలు..
నావిక్‌(జనరల్‌ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.

నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.2000–31.03.2004 మధ్య జన్మించి ఉండాలి.

యాంత్రిక్‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌(రేడియో/పవర్‌) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది.స్టేజ్‌1,2,3,4 ద్వారా ఎంపికచేస్తారు.

మొదటి దశ(స్టేజ్‌–1): స్టేజ్‌–1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్‌–1, 2,3,4,5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, అడిగే ప్రశ్నల గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
రెండో దశ(స్టేజ్‌–2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్‌ జాబితా తయారుచేస్తారు. దీని ప్రకారం స్టేజ్‌–2కి ఎంపికచేస్తారు. ఇందులో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్‌ టెస్ట్, తొలి మెడికల్‌ టెస్ట్‌ ఉంటాయి.
మూడో దశ(స్టేజ్‌–3): స్టేజ్‌–1, స్టేజ్‌–2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్‌–3కి ఎంపికచేస్తారు. స్టేజ్‌–3లో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఫైనల్‌ మెడికల్‌ టెస్ట్, ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, పోలీస్‌ వెరిఫికేషన్‌ ఉంటాయి.
నాలుగో దశ(స్టేజ్‌–4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌లు/యూనివర్సిటీలు /రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇండియన్‌ కోస్టు గార్డ్‌ ముందు ఉంచాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 02.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in

11, జూన్ 2021, శుక్రవారం

Indian Coastal Guard Posts 2022 Batch | Dates to Apply Online: 02/07/2021 to 16/07/2021

Post Name: NAVIK, YANTRIK 01/2022 BATCH

Posts:

  • Navik(General Duty)- 260 Posts
    Navik (Domestic Branch)- 50 Posts
    Yantrik (Mechanical)- 20 Posts
    Yantrik (Electrical)- 13 Posts
    Yantrik (Electronics)- 07 Posts

Qualification: MALE INDIAN CITIZENS possessing educational qualifications mentioned below.

  • Navik (General Duty):-  10+2 passed with Maths and Physics from an education board recognized by Council of Boards for School Education (COBSE).
  • Navik (Domestic Branch):- 10th Class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE).
  • Yantrik:- 10th class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE) AND  Diploma in Electrical/ Mechanical / Electronics/ Telecommunication (Radio/Power) Engineering of duration 03 or 04 years approved by All India Council of Technical Education (AICTE).
    OR
    10th & 12thclass passed from an education board recognized by Council of Boards for School Education (COBSE) AND  Diploma in Electrical/ Mechanical / Electronics/ Telecommunication (Radio/Power) Engineering of duration 02 or 03 years approved by All India Council of Technical Education (AICTE)”.

Pay Scale: Basic pay Rs.21,700 – Rs.29200/- (Pay Level-5).  In addition, you will be paid Yantrik pay @ Rs. 6200/- plus

Job Location: All Over India

Dates to Apply Online: 02/07/2021 to 16/07/2021

Age Limit: Minimum 18 years and maximum 22 years.

Selection Process:

  • Stage- I –Written Examination
  • Physical Fitness Test- All three test of PFT are to be carried out in continuity without any break. 
    • 1.6 Km run to be completed in 7 minutes.
    • 20 Squat ups (UthakBaithak).
    • 10 Push-up.
  • Document verification- original documents like grade X/XII/ Diploma mark sheet/photo Identity card/caste certificate/individual subject and aggregate marks.

How To Apply: Applications will be accepted ‘Online only’ from 02 Jul 21(1000 hrs) TO 16 Jul 21.

Candidates are to logon to https://joinindiancoastguard.cdac.in and follow the instructions for registering yourself with e-mail ID/mobile number. The candidates are to ensure validity of e-mail and mobile number at least up to 30 Jun 2022. 

Examination fee. Candidates (except SC/ST candidates, who are exempted from payment of fee) are required to pay a fee of Rs. 250/-

Post Details
Links/ Documents
Official Notification Download
Application Form available from 02nd JulyClick Here

 

10, జూన్ 2021, గురువారం

యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021- 400 ఎన్‌డిఎ(NDA &NA) పోస్టులు | దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 29.06.2021.

NATIONAL DEFENSE ACADEMY & NAVAL ACADEMY EXAMINATION (II), 2021

యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021 నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష

ఎన్డీఏ యొక్క ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ విభాగాలలో ప్రవేశానికి 2021 సెప్టెంబర్ 05 న పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండియన్ నావల్ అకాడమీ కోర్సు (INAC) జూలై 2, 2022 నుండి ప్రారంభమవుతుంది.

ఖాళీలు: 400 పోస్టులు

  • నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 పోస్టులు
    • ఆర్మీ- 208 పోస్టులు
    • నేవీ- 42 పోస్టులు
    • విమానిక దళం- 120 పోస్టులు
  • నావల్ అకాడమీ- 30పోస్టులు

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

ఏజ్ క్రైటీరియా: పెళ్లికాని పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు, 2003 జనవరి 02 నుండి 2006 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు.

విద్యా అర్హత: 12 వ తరగతి పాస్.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 29.06.2021.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ I, పేపర్ II), ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్.

  • పేపర్ I- గణిత పరీక్ష
  • పేపర్ II-జనరల్ ఎబిలిటీ టెస్ట్
  • SSB పరీక్ష / ఇంటర్వ్యూ
  • మెడికల్ పరీక్ష

పరీక్షా కేంద్రాలు: అగర్తాలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, ప్రయాగ్రాజ్ (అలహాబాద్), బెంగళూరు, బరేలీ, భోపాల్, చండీగ, ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, Delhi ిల్లీ, ధార్వాడ్, డిస్పూర్, గాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జైపూర్, జమ్మూర్ , లక్నో, మదురై, ముంబై, నాగ్‌పూర్, పనాజీ (గోవా), పాట్నా, పోర్ట్ బ్లెయిర్, రాయ్‌పూర్, రాంచీ, సంబల్పూర్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, తిరుపతి, ఉదయపూర్ మరియు విశాఖపట్నం.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల దరఖాస్తుదారులు https://www.upsc.gov.in/ వద్ద అందుబాటులో ఉన్న సూచించిన దరఖాస్తు ఆకృతిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. “ఆన్‌లైన్‌లో వర్తించు” లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన మహిళా / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులను మినహాయించి) రూ. 100 / –

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్Download
పార్ట్ I రిజిస్ట్రేషన్

పార్ట్ II రిజిస్ట్రేషన్

Click Here

Click Here

9, జూన్ 2021, బుధవారం

నిమ్‌హాన్స్, బెంగళూరులో 275 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 275
పోస్టుల వివరాలు: సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(న్యూరోమస్‌క్యులార్‌)–01, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌–01, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌–01, నర్సింగ్‌ ఆఫీసర్‌–266, స్పీచ్‌ థెరపిస్ట్‌ అండ్‌ ఆడియాలజిస్ట్‌–03, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(హ్యూమన్‌ జెనెటిక్స్‌)–01, టీచర్‌ ఫర్‌ ఎంఆర్‌ చిల్డ్రన్‌(క్లినికల్‌ సైకాలజీ)–01, అసిస్టెంట్‌ డైటీషియన్‌–01.

సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(న్యూరోమస్‌క్యులార్‌):
అర్హత:
బేసిక్‌/మెడికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌:
అర్హత: కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు స్టాటిస్టికల్‌ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌:
అర్హత: పోస్ట్‌ ఎండీ/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎండీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకుSరూ.44,900 చెల్లిస్తారు.

నర్సింగ్‌ ఆఫీసర్‌:
అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎస్సీ(నర్సింగ్‌)ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. నర్సులు, రాష్ట్ర మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.44,900 చెల్లిస్తారు.

స్పీచ్‌ థెరపిస్ట్‌ అండ్‌ ఆడియాలజిస్ట్‌:
అర్హత: స్పీచ్‌ పాథాలజీ/ఆడియాలజీ /తత్సమాన సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(హ్యూమన్‌ జెనెటిక్స్‌):
అర్హత: లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

టీచర్‌ ఫర్‌ ఎంఆర్‌ చిల్డ్రన్‌(క్లినికల్‌ సైకాలజీ):
అర్హత: సైకాలజీ సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సాధారణ/వికలాంగుల పాఠశాలలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ డైటీషియన్‌:
అర్హత: సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏదైనా మేజర్‌ హాస్పిటల్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్‌ బాక్స్‌నెం. 2900, హోసర్‌ రోడ్, బెంగళూరు–560029 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.nimhans.ac.in

8, జూన్ 2021, మంగళవారం

ఐఐపీఈ, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021


విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, ఎర్త్‌ సైన్సెస్, మెకానికల్‌ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్‌.

ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,59,100–2,20,200 వరకు చెల్లిస్తారు.

అసోసియేట్‌ ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 6ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,39,600–2,11,300 వరకు చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు:
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.1,01,500–1,67,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌(ఐ/సీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎన ర్జీ, సెకండ్‌ ఫ్లోర్, ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ మెయిన్‌ బ్లాక్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌–530003, ఇండియా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.iipe.ac.in

ఏపీ, అనంతపురంలోని జైలులో వివిధ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జైలు.. ఒప్పంద ప్రాతిపదికన పారామెడికల్‌ స్టాఫ్, ఎలక్ట్రీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్‌–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, మేల్‌ నర్సింగ్‌–02, ఫీమేల్‌ నర్సింగ్‌–01, ఎలక్ట్రీషియన్‌–01.

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2: డిప్లొమా(ఫార్మసీ)/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2: పదో తరగతి, డీఎంఎల్‌టీ/బీఎస్సీ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
మేల్, ఫీమేల్‌నర్సింగ్‌ గ్రేడ్‌–2: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ప్రాథమిక చికిత్స సంబంధించిన ధ్రువపత్రం ఉండాలి.
ఎలక్ట్రీషియన్‌:ఐటీఐ(ఎలక్ట్రికల్‌)ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును సూపరిండెంట్, జిల్లా జైలు, అనంతపురం చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: ananthapuramu.ap.gov.in

10, 447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021



ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో..కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 10,447
పోస్టుల వివరాలు:
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌): 5096
ఆఫీసర్‌ స్కేల్‌–1: 4119
ఆఫీసర్‌ స్కేల్‌–2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 25
ఆఫీసర్‌ స్కేల్‌–2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 43
ఆఫీసర్‌ స్కేల్‌–2(ట్రెజరీ మేనేజర్‌): 10
ఆఫీసర్‌ స్కేల్‌–2(లా): 27
ఆఫీసర్‌ స్కేల్‌–2(సీఏ): 32
ఆఫీసర్‌ స్కేల్‌–2(ఐటీ): 59
ఆఫీసర్‌ స్కేల్‌–2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 905
ఆఫీసర్‌ స్కేల్‌–3: 151

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామ్‌), సూచించిన పోస్టులకు ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్టు 2021
ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేది: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.ibps.in

ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఖాళీలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021

 



హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్పెషలిస్ట్, ఐఈసీ అండ్‌ డాక్యుమెంటేషన్‌ ఎక్స్‌పర్ట్, అసోసియేట్‌ స్ట్రాటజిక్‌ మేనేజర్లు, ప్రోగ్రామ్‌ మేనేజర్, ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్, రీసెర్చ్‌ అసిస్టెంట్, రీసెర్చ్‌ అసోసియేట్, ఈటీఎల్‌ టూల్‌ స్పెషలిస్ట్, సీనియర్‌ కన్సల్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://career.nirdpr.in

ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021



హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ.. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)కు చెందిన జార్ఖండ్‌లోని టాకిసుడ్‌ నార్త్‌ కోల్‌మైన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 89
పోస్టుల వివరాలు: కొల్లియరీ ఇంజనీర్‌(మెకానికల్, ఎలక్ట్రికల్‌)–02, లెయిజనింగ్‌ ఆఫీసర్‌–02, మైనింగ్‌ ఇంజనీర్‌–12, సర్వేయర్‌–02, ఎలక్ట్రికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ ఓవర్‌మెన్‌–25, మెకానికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ సిర్దార్‌–38.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ సిర్దార్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ పోస్టుల ఇంటర్వూ్య ఆధారంగా; సూపర్‌వైజర్లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు రాతపరీక్ష సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: రాతపరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన సూపర్‌వైజరీ పోస్టు అభ్యర్థులను సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌కు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.nmdc.co.in

ఆర్మీలో మహిళా మిలిటరీ పోలీస్‌ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021

 



ఇండియన్‌ ఆర్మీ.. ఉమెన్‌ మిలిటరీ పోలీస్‌ విభాగంలో సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 100
పోస్టుల వివరాలు: సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ(ఉమెన్‌ మిలిటరీ పోలీస్‌).
అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in