9, జూన్ 2021, బుధవారం

నిమ్‌హాన్స్, బెంగళూరులో 275 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 275
పోస్టుల వివరాలు: సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(న్యూరోమస్‌క్యులార్‌)–01, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌–01, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌–01, నర్సింగ్‌ ఆఫీసర్‌–266, స్పీచ్‌ థెరపిస్ట్‌ అండ్‌ ఆడియాలజిస్ట్‌–03, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(హ్యూమన్‌ జెనెటిక్స్‌)–01, టీచర్‌ ఫర్‌ ఎంఆర్‌ చిల్డ్రన్‌(క్లినికల్‌ సైకాలజీ)–01, అసిస్టెంట్‌ డైటీషియన్‌–01.

సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(న్యూరోమస్‌క్యులార్‌):
అర్హత:
బేసిక్‌/మెడికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌:
అర్హత: కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు స్టాటిస్టికల్‌ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌:
అర్హత: పోస్ట్‌ ఎండీ/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎండీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకుSరూ.44,900 చెల్లిస్తారు.

నర్సింగ్‌ ఆఫీసర్‌:
అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎస్సీ(నర్సింగ్‌)ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. నర్సులు, రాష్ట్ర మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.44,900 చెల్లిస్తారు.

స్పీచ్‌ థెరపిస్ట్‌ అండ్‌ ఆడియాలజిస్ట్‌:
అర్హత: స్పీచ్‌ పాథాలజీ/ఆడియాలజీ /తత్సమాన సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(హ్యూమన్‌ జెనెటిక్స్‌):
అర్హత: లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

టీచర్‌ ఫర్‌ ఎంఆర్‌ చిల్డ్రన్‌(క్లినికల్‌ సైకాలజీ):
అర్హత: సైకాలజీ సబ్జెక్టుతో బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సాధారణ/వికలాంగుల పాఠశాలలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ డైటీషియన్‌:
అర్హత: సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏదైనా మేజర్‌ హాస్పిటల్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్‌ బాక్స్‌నెం. 2900, హోసర్‌ రోడ్, బెంగళూరు–560029 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.nimhans.ac.in

కామెంట్‌లు లేవు: