🔳రేపటి నుంచి సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ 10 Jun, 2020 03:47 IST|Sakshi
కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో వివిధ ప«థకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జేసీ పూర్తి బాధ్యత తీసుకోవాలి.. కలెక్టర్లు పర్యవేక్షించాలి
జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో ‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్
వర్షాలు ప్రారంభమయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలి
జూన్ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోవాలి
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి కనీసం 50 ఎకరాల మేర స్థలాన్ని త్వరగా అప్పగించాలి
గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై రోజు వారీ సమీక్ష నిర్వహించాలి
మద్యం, ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపితేనే తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతాం. కుటుంబాల్లో ప్రేమ, అనురాగాలను నింపగలుగుతాం. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దు. సీఎం మీతో ఉన్నాడు.. దూకుడుగానే ఉండండి.
రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చే వారని, ఇప్పుడు 54.5 లక్షల మంది వస్తున్నారని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లను అభినందిస్తున్నా. వచ్చే సమీక్షా సమావేశం నాటికి కనీసం 60 లక్షల మందికి పనులు కల్పించాలి.
కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలను తొలగించాలి. కరోనా అని అనుమానం రాగానే ఎవరికి కాల్ చేయాలి.. ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి.. పాజిటివ్ వస్తే ఎలాంటి వైద్యం చేయించుకోవాలి.. అనే కీలక విషయాలపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాలి. ఇది చేస్తేనే వైరస్ అనుమానితులు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటారు. ఏ ఇబ్బందీ ఉండదు. అప్పుడే మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. లేకపోతే అది ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది.
సాక్షి, అమరావతి: గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్న వాళ్లు పక్కనే ఉన్న రీచ్‌ల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుకను తెచ్చుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల అవుతుందని, గ్రామ సచివాలయంలో అనుమతులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన వివిధ పథకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.
అన్ని ఇసుక రీచ్‌లనూ ఓపెన్ చేయాలి
► వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలి. జూన్ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రస్తుతం లక్షన్నర టన్నుల వరకూ ఇస్తున్నాం.
► శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలి. అన్ని రకాల రీచ్‌లను తెరవాలి. కొత్త సోర్స్‌లను గుర్తించాలి.
► బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి. ఈ విధానం పారదర్శకంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. వర్షాలు వస్తున్నందున మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలి.
ఇళ్ల స్థలాల పంపిణీ చిరస్మరణీయం
► ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్త వారితో కలిపి 30.30 లక్షల మందికిపైగా లబ్ధిదారులుండొచ్చు. వీరందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం. జూన్ 12 కల్లా లబ్ధిదారుల తుది జాబితాను డిస్‌ప్లే చేయాలి.
► జూన్ 15 నాటికి పాత, జూన్ 30 నాటికి కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే కచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. జూన్ 15 నాటికి ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉండాలి. జూలై 8న అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.
► సంతృప్త స్థాయిలో మనం ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కలెక్టర్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఇది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియలో చివరి దశకు వచ్చాం. కొత్త అప్లికేషన్లు వచ్చినప్పటికీ అదే ఉత్సాహంతో వారికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరుతున్నా.
ఇ–క్రాప్ బుకింగ్ కీలకం
► ఇ–క్రాప్ బుకింగ్ 100 శాతం కచ్చితత్వంతో జరగాలి. వ్యవసాయ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్ ద్వారా ఇ–క్రాప్ బుకింగ్ చేయించాలి. తప్పులు లేకుండా పారదర్శకంగా జరగాలి. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రయోజనాలకు ఇ– క్రాప్ బుకింగ్ అనేది పునాదిగా నిలుస్తుంది.
► కనీస గిట్టుబాటు ధర పొందడానికి ఈ విధానం చాలా కీలకం. ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఆదుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పంట రుణాలకు, ఇన్సూరెన్స్‌కు కూడా ఉపకరిస్తుంది.
► ఉద్యాన పంటలకు ప్రత్యేక అప్లికేషన్ ఉంది. ఆక్వాను కూడా ఇ–క్రాపింగ్‌లో ప్రత్యేక అప్లికేషన్‌లో పెడుతున్నాం. మార్కెటింగ్‌లో ఇది కీలకం కాబోతుంది.
నాడు–నేడుపై జేసీ నిత్యం పర్యవేక్షించాలి
► అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్న జేసీ స్కూళ్లలో నాడు– నేడు కార్యక్రమాలను ప్రతిరోజూ పర్యవేక్షించాలి. ఏం కావాలన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. పనులు మాత్రం వేగంగా జరగాలి.
► 15 కొత్త మెడికల్ కాలేజీలను మనం కట్టబోతున్నాం. ఇందుకు సంబంధించిన స్థలాలను హేండోవర్ చేయాల్సి ఉంది. ఒక్కో కాలేజీ కోసం కనీసం 50 ఎకరాలు గుర్తించాలి.
► వచ్చే సమీక్షా సమావేశం నాటికి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), అంగన్‌వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్, మెడికల్ కాలేజీలకు సంబంధించి భూముల గుర్తింపు పూర్తి కావాలి.
► గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌పై మరింతగా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉంటే అనుమతులు ఇచ్చి పనులు వేగవంతం చేయాలి.
► పట్టణ, నగరాల్లోని వైఎస్సార్ క్లినిక్స్‌కు సంబంధించి రేపటికి మ్యాపింగ్ చేయబోతున్నారు. వీటికి స్థలాలను గుర్తించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది.
► అంగన్‌వాడీ కేంద్రాలు కూడా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాయి. 55 వేల అంగన్‌వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగులు కట్టాలి. మిగిలిన వాటిలో మరమ్మతులు చేయాలి. వీటిలో కూడా నాడు–నేడు కింద కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటిపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
కోవిడ్–19పై ప్రజల్లో అవగాహన పెంచాలి
► కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు చాలా బాగా పని చేశారు. వలంటీర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ వర్కర్లు.. అందరూ చాలా బాగా పని చేశారు.
► కరోనా వైరస్ విషయంలో దేశంలో పాజిటివిటీ రేటు 6 శాతం అయితే రాష్ట్రంలో 1 శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చారు. అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో కోవిడ్‌తో ఎలా కలిసి బతకాలన్న దాని గురించి మనం ఆలోచించాలి.
► 85 శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. కేవలం 2 శాతం కేసుల్లో మాత్రమే మరణాలు ఉంటున్నాయి. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఐసోలేషన్ ఫెసిలిటీస్ మీద కూడా దృష్టి పెట్టాలి.
సచివాలయాల ఉద్యోగులపై జేసీ దృష్టి పెట్టాలి
► గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులపై సంబంధిత జేసీ దృష్టి పెట్టాలి. పనీతీరుపై, ప్రజలకు అందుతున్న సేవలపై రోజూ సమీక్ష నిర్వహించాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. ► స్పందన కింద వచ్చే వినతులను జాగ్రత్తగా పర్యవేక్షించడం మొదలుపెడితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి సచివాలయంలో లబ్ధిదారుల జాబితా అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి.
► ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఇచ్చిన అతి ముఖ్యమైన నంబర్లు, సచివాలయాల్లో అందే సేవల గురించి గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పకుండా డిస్ ప్లే కావాలి. అలాగే ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలిపేలా ప్రకటించిన సంక్షేమ క్యాలండర్‌నూ ప్రదర్శించాలి.
► లబ్ధిదారులకు బియ్యం కార్డులు, పింఛన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను డోర్ డెలివరీ చేయాలి. బయోమెట్రిక్ అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి.
► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
► మద్యం వినియోగం తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశాం. 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాం.
► మద్యం విక్రయించే వేళలనూ బాగా తగ్గించాం. పద్ధ్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నాం. షాక్ కొట్టే రీతిలో రేట్లు పెంచాం.
► ఇవన్నీ చేస్తున్నప్పుడు మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలి. బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరక్కూడదు.

కామెంట్‌లు