11, జూన్ 2020, గురువారం

🔳పాఠశాల విద్యార్థుల సిలబస్‌ తగ్గింపు? అభిప్రాయాలు కోరిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరాన్ని పాఠశాల విద్యార్థులు నష్టపోకుండా పలు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. సిలబస్‌, బోధనా సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ‘సిలబస్‌ఫర్‌స్టూడెంట్స్‌2020’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకోవాలన్నారు.

రోటరీ ఇండియాతో కలిసి ఈ-లెర్నింగ్‌ పాఠాల తయారీ
1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ-లెర్నింగ్‌ పాఠాలను తమ టీవీ ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు... రోటరీ ఇండియాతో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) చేతులు కలిపింది. ఆధునిక సాంకేతికత, నవకల్పన పునాదులపై సరికొత్త విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు నిశాంక్‌ చెప్పారు. విద్యాదాన్‌ పథకం కింద రోటరీ సంస్థ 1-12 తరగతుల పాఠ్యాంశాలన్నింటినీ హిందీ భాషలో అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి మొత్తం 12 ఎన్‌సీఈఆర్‌టీ ఛానళ్ల ద్వారా ఈ పాఠాలను ప్రసారమవుతాయి.

కామెంట్‌లు లేవు: