ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుకు అప్లై చేయు విధానము | Ration Card Apply Process In AP.,
How to get new ration card, member addition, splitting ration card, Surrendering ratio card and deletion process.
మీకు కొత్త రేషన్ కార్డ్, Member addition, Surrendering ration card,Splitting ration card and Member deletion కి ఉండాల్సిన పత్రాలు, అర్హతలు మరియు రేషన్ కార్డ్ పొందే విధానం తెలుసుకోండి.
ముందుగా కావల్సిన పత్రాలు:
1. కుటుంబంలో ఉన్న సభ్యులు అందరికీ ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలి.
2. కుటుంబ సభ్యులు అంతా PSS సర్వే లో ఒకే కుటుంబం లో నమోదు అయి ఉండాలి.
అర్హతలు:
1. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు అర్హులు కాదు.
2. భూమి పది ఏకరముల లోపు ఉండాలి.
3. Income tax చెల్లించే వారై ఉండకూడదు.
4. మీ నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్స్ కు మించకుడదు.
5. Four wheeler ఉండకూడదు.
6. మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే వారై ఉండకూడదు.
. పైన చెప్పిన వాటి ప్రకారం మీకు రేషన్ కార్డ్ అనేది ప్రభుత్వం జారీ చేస్తుంది.
. కాబట్టి మీరు పైవన్నీ గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
రేషన్ కార్డ్ కి దరఖాస్తు చేయు విధానం మరియు వర్క్ ఫ్లో:
1. మొదట మీరు మీ గ్రామ/వార్డు సచివాలయం లో ఉన్న DA దగ్గరికి వెళ్ళి మీకు సంబందించిన పత్రాలు ఇవ్వాలి.
2. అలా ఇచ్చిన తరువాత DA వారి login లో మీయొక్క వివరాలు నమోదు చేసి, అందుకు సంబంధించిన పత్రాలు upload చేస్తారు.
3. ఆ పక్రియ తరువాత మీకు ఒక receipt జెనరేట్ అవుతుంది.
4. అలా అప్లోడ్ చేసిన application వివరాలు VRO స్పందన Login లోకి మరియు Volunteer Aepos App లోకి వెళ్తాయి.
5. మీ VRO గారు అతని స్పందన లాగిన్ లో మీయొక్క వివరాలను validation చేసిన తరువాత pre populated form ఒకటి generate అవుతుంది.
6. అలా generate అయిన pre populated form నీ VRO మీయొక్క volunteer కి ఇచ్చి మీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయమంటారు.
7. మీ వాలంటీర్ ఆ generate అయిన pre populated form నీ తీసుకొని మీ కుటుంబం లోని అందరితో Aepds app లో ekyc చేయించి తిరిగి VRO కి అందజేస్తారు.
8. ఇక్కడ వాలంటీర్ చేసిన సర్వే లో మీరు పైన చెప్పిన కారణాలతో అనర్హులు అయితే మీ అప్లికేషన్ ఇక్కడే రిజెక్ట్ చేయబడుతుంది.
9. ఒకవేళ మీరు అర్హులు అయితే PSS సర్వే ఆధారితంగా system లో eligible అయితే సోషల్ ఆడిట్ చేసి మీ అర్హతను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్హులు అయితే మీ యొక్క స్పందన ఎండార్స్మెంట్ క్లోజ్ చేసి VRO login నుంచి తహశీల్దార్ గారి login లోకి మీ వివరాలు forward చేయబడుతాయి.
10. తహశీల్దార్ లాగిన్ లో డిజిటల్ సైన్ పూర్తి అయిన తరువాత మీకు కొత్త రేషన్ కార్డ్ జారీ చేస్తారు.
11. మనం 9 వ పాయింట్ లో చెప్పుకున్నట్టు PSS సర్వే ఆధారితంగా మీరు అర్హులు కాదు అని system లో ineligible చూపిస్తే మళ్లీ మీ యొక్క వాలంటీర్ మళ్లీ మీకు ఏ కారణం చేత మీరు అనర్హులు అనే విషయం మీద మిమ్మల్ని అభిప్రాయం సేకరణ చేస్తాడు. ఇక్కడ మీ అనర్హత ను పలాన కారణం వల్ల అని మీరు ఒప్పుకుంటే అక్కడితో మీ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది, మీ రేషన్ కార్డ్ రాదు. మీరు ఒకవేళ ఆ కారణాన్ని ఒప్పుకోకపోతే, ఏ reason వల్ల మీకు అర్హత లేదో ఆ reason కు తగిన department కు మీ యొక్క application grievance forward చేయబడుతుంది. ఇక్కడ కూడా మీరు ineligible అని తేలితే మీ application close చేస్తారు.
12. ఒకవేళ మీరు eligible అయితే పైన 10 వ పాయింటు లో చెప్పినట్టు మీ అప్లికేషన్ మళ్లీ VRO గారు తన లాగిన్ నుంచి తహశీల్దార్ గారికి forward చేస్తారు. అక్కడ digital sign with approval తో మీకు కొత్త రేషన్ కార్డ్ జారీ చేస్తారు.
గమనిక:
1. Member addition(only birth and migration due to marriage),
2. Member deletion(only died persons are allowed to to be deleted)
3. Splitting Ration Card(only birth and due to marriage)
4. Surrender Ration card due to migration from one place to another place.
కామెంట్‌లు