28, నవంబర్ 2023, మంగళవారం

రేపు బహిరంగ వేలం | Open auction tomorrow

హిందూపురం టౌన్: మున్సిపల్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్, వెజిటేబుల్ మార్కెట్ వద్ద ద్విచక్ర వాహనాల పార్కింగ్కు ఈ నెల 29న మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమాదక్కుమార్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం మున్సిపాలిటీకి రాకపోవడంతో వేలాన్ని వాయిదా వేశామన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం వద్ద వేప చెట్టు నుంచి గాంధీ చౌక్ వరకూ అలాగే కాంప్లెక్స్ పడమర వైపు ఉన్న ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనాల పార్కింగు వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని సూచించారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) 906 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులను భర్తీచేయనుంది. | Airports Authority of India Cargo Logistics and Allied Services Company Limited (AICLAS) is going to fill 906 Security Screener (Fresher) Posts.

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) 906 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులను భర్తీచేయనుంది.

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) 906 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులను భర్తీచేయనుంది. దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

01.11.2023 నాటికి 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన జనరల్‌ అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 55 శాతం మార్కులు సరిపోతాయి.

  • ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో రాసే, మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
  • 01.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
  • ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌పోర్టులు, కార్గో కాంప్లెక్సుల్లో కార్గో స్క్రీనింగ్‌, సెక్యూరిటీ విధులను నిర్వర్తించాలి.

జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఎంపిక విధానం

వచ్చిన దరఖాస్తుల నుంచి షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి అభ్యర్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కలర్‌ బ్లైండ్‌నెస్‌ దృశ్య, వినికిడి సమస్యలు ఉండకూడదు. భావవ్యక్తీకరణ సామర్థ్యం, శారీరక దృఢత్వం ఉండాలి.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ బేసిస్‌లో మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు ప్రొబేషన్‌ వర్తిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు కొన్ని కోర్సుల్లో శిక్షణనిస్తారు. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి.

  • ఏవీఎస్‌ఈసీ ఇండక్షన్‌ కోర్స్‌ - 5 రోజులు
  • ఎట్‌ ఎయిర్‌పోర్ట్‌/ఆర్‌ఏ - మూడు నెలలు
  • ఏవీఎస్‌ఈసీ బేసిక్‌ కోర్స్‌ - 14 రోజులు
  • ఎట్‌ ఎయిర్‌పోర్ట్‌ - నెల రోజులు
  • స్క్రీనర్స్‌ ప్రీ-సర్టిఫికేషన్‌ కోర్సు - 3 రోజులు
  • టెస్టింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ స్క్రీనర్‌ - 2 రోజులు

ఈ శిక్షణలన్నింటినీ ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేయాలి. ఒక్కో పరీక్షను రెండు ప్రయత్నాల్లో పూర్తిచేయొచ్చు. మొదటి ప్రయత్నంలో విఫలమైనట్టయితే అభ్యర్థి స్టైపెండ్‌ను నెలకు రూ.15,000 నుంచి రూ.10,000 తగ్గిస్తారు. రెండుసార్లూ విఫలమైనట్లయితే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తారు.

శిక్షణను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30,000 వేతనం చెల్లిస్తారు. రెండో ఏడాది రూ.32,000, మూడో ఏడాది రూ.34,000. దీనికి అదనంగా టూర్లకు వెళ్లినప్పుడు టీఏ/డీఏ/లాడ్జింగ్‌, బోర్డింగ్‌ సదుపాయాలూ ఉంటాయి. ఉద్యోగికీ, కుటుంబ సభ్యులకూ వర్తించే విధంగా పీఎఫ్‌, గ్రాట్యుటీ, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయాలు ఉంటాయి.  

ఎంపికైన అభ్యర్థులను సంస్థ పాలనాపరమైన అవసరాల నిమిత్తం చెన్నై, కోల్‌కతా, గోవా, కోజీకోడ్‌ (కాలికట్‌), వారణాసి, శ్రీనగర్‌, వడోదరా, మదురై, తిరుపతి, రాయ్‌పుర్‌, వైజాగ్‌, ఇందౌర్‌, అమృత్‌సర్‌, భువనేశ్వర్‌, అగర్తలా, పోర్ట్‌బ్లెయిర్‌, తిరుచి, దెహ్రాదూన్‌, పుణె, సూరత్‌, లేహ్‌, పట్నాల్లో ఎక్కడైనా నియమించవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.12.2023

వెబ్‌సైట్‌:www.aaiclas.aero

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రభుత్వ ఉద్యోగాలు | డీఆర్‌డీవోలో ప్రాజెక్ట్‌ పోస్టులు | గ్రూప్‌-ఏ, బీ, సీ ఖాళీలు | ఏలూరులో పారామెడికల్‌ పోస్టులు | ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 72 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | సివిల్‌ సప్లైస్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు | ఏపీఎస్సీఎస్సీఎల్‌లో అకౌంటెంట్‌లు | Government Jobs | Project Posts in DRDO | Group-A, B, C Vacancies | Paramedical Posts in Eluru | Applications are invited for filling up 72 various posts in Medical Institutions in Joint Anantapur District. | Technical Assistants in Civil Supplies | Accountants in APSCSCCL |

ప్రభుత్వ ఉద్యోగాలు

డీఆర్‌డీవోలో ప్రాజెక్ట్‌ పోస్టులు

హైదరాబాదులోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో).. కాంట్రాక్టు ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్ట్‌ స్టోర్‌ ఆఫీసర్‌: 01
  • ప్రాజెక్ట్‌ సీనియర్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 05
  • ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 05

అర్హత: డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్‌సీ/ బీసీఏ)తో పాటు పని అనుభవం.

వయసు: 56 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

గ్రూప్‌-ఏ, బీ, సీ ఖాళీలు

త్తర్‌ప్రదేశ్‌ నోయిడాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌)... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రూప్‌ ఎ పోస్టులు

1. డిప్యూటీ డైరెక్టర్‌
2. అసిస్టెంట్‌ డైరెక్టర్‌
3. అకడమిక్‌ ఆఫీసర్‌

గ్రూప్‌ బి పోస్టులు

4. సెక్షన్‌ ఆఫీసర్‌
5. పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌
6. ఈడీపీ సూపర్‌వైజర్‌
7. గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌
8. జూనియర్‌ ఇంజినీర్‌

గ్రూప్‌ సి పోస్టులు

9. అసిస్టెంట్స్‌
10. స్టెనోగ్రాఫర్‌
11. జూనియర్‌ అసిస్టెంట్స్‌
12. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌

మొత్తం ఖాళీలు: 62

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2023.

వెబ్‌సైట్‌:www.nios.ac.in

ఏలూరులో పారామెడికల్‌ పోస్టులు

లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాలలో ఒప్పంద/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

ఆఫీస్‌ సబార్డినేట్స్‌, ఈఎంటీ, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌, ఫార్మసిస్ట్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, ఏలూరు’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 11-12-2023.

వెబ్‌సైట్‌: https://eluru.ap.gov.in/notice_category/ recruitment

ల్యాబ్‌ అటెండెంట్‌, నర్సింగ్‌ ఆర్డర్లీలు

మ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 72 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వైద్య సంస్థలు: ప్రభుత్వ వైద్య కళాశాల/ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (అనంతపురం), ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ (అనంతపురం), కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (అనంతపురం).

ఖాళీలు: ల్యాబ్‌ అటెండెంట్స్‌, నర్సింగ్‌ ఆర్డర్లీ, అటెండర్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, అనంతపురం’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 4-12-2023.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/

సివిల్‌ సప్లైస్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు  

రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన 12 టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుల నియామకానికి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌ / బయోటెక్నాలజీ/ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌/ బాటనీ).

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా.

దరఖాస్తు: నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్‌ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ‘డిస్ట్రిక్ట్‌ సివిల్‌ సప్లైస్‌ మేనేజర్‌ ఆఫీస్‌, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా’ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 5-12-2023.

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/

ఏపీఎస్సీఎస్సీఎల్‌లో అకౌంటెంట్‌లు

నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • అకౌంటెంట్‌ గ్రేడ్‌ III: 02  
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02  

అర్హత: డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఎంకాం.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్‌, వేదాయపాళెం, నెల్లూరు’ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

4న ఆర్టీసీ అప్రెంటీస్ షిప్ ఇంటర్వ్యూలు | RTC Apprenticeship Interviews on 4th

పుట్టపర్తి, నవంబరు 27: ఆర్టీసీలో అప్రెంటీసిప్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబరు 4వ తేదీన కర్నూలు జోనల్ కార్యాలయంలో హాజరు కావాలని శ్రీసత్యసాయి జిల్లా ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ) అధికారి (డీపీటీఓ) మధుసూదన్ సోమ వారం ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు కుల, దివ్యాంగ, డ్రైవింగ్, బ్యాంకు ఖాతా, ఫొటోలు, ఆధార్, మార్కుల జాబితాతో హాజరుకావా లని ఆయన సూచించారు.

అప్రెంటిసిప్ అభ్యర్థులకు 4న ఇంటర్వ్యూలు
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీలో అప్రెంటిసిప్ కోసం
ఆన్లైన్ దరఖాస్తున్న అభ్యర్థులకు డిసెంబర్
4వ తేదీ ఉదయం 9 గంటలకు కర్నూలులోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నజీర్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ
ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన 40 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు పదో తరగతి
మార్కుల జాబితా, ఆధార్ కార్డు, జనన, కుల ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్లో పాటు పాస్పోర్టు సైజ్ ఫొటో తీసుకుని రావాలన్నారు. మరింత సమాచారం కోసం 08518 - 257025 నంబరులో సంప్రదించాలని సూచించారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఇండియా స్కిల్ కాంపిటీషన్ కు దరఖాస్తులు | Applications for India Skill Competition

అంతర్జాతీయ స్థాయిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎసీసీ) చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఏపీ ఎస్ఓసీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఇండియా స్కిల్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది 40 విభాగాల్లో నైపుణ్య ప్రదర్శనకు ఏపీఎస్ఎస్ఓసీ అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో విజేతలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ స్థాయిలో గెలిచినవారు ఫ్రాన్స్లోని లియోన్లో 2024లో జరిగే అంతర్జాతీయ వేదికలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 2021లో జాతీయ స్థాయిలో
17 పతకాలు సాధించి అయిదవ స్థానంలో నిలిచిన ఏపీ ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తిగల యువత డిసెంబర్ 15లోగా https://skilluniverse.apssdc.in/world-skill-registration
అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిందిగా ఏపీఎస్ఎస్ఓసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఏపీఎస్ఎస్ఓసీ వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

7,442 బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ | The filling of 7,442 B.Sc nursing seats has been completed

రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మూడో/చివరి విడత కౌన్సెలింగ్ కింద సీట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7,908 సీట్లకు గాను 7,442 సీట్లు భర్తీ కాగా, 466 సీట్లు మిగిలిపోయాయి. https://ugnursing.ysruhs.com/ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు సీట్ అలాట్మెంట్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తమకు సీట్లు కేటాయించిన కళాశాలల్లో విద్యార్థులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా రిపోర్ట్ చేయాల్సిందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం https://drysr.uhsap.in వెబ్సైట్ను దర్శించాలని తెలిపారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

డీ ఫార్మసీ అడ్మిషన్లకు షెడ్యూలు | Schedule for D Pharmacy Admissions

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): డీఫార్మసీ రెండేళ్ల డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ సి.నాగరాణి సోమవారం షెడ్యూలు విడుదల చేశారు. ఈనెల 29, 30 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేసుకోవాలన్నారు. 30 నుంచి డిసెంబరు 2 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని, నాలుగో తేదీన సీట్లు కేటాయిస్తామని వివరించారు. 5 నుంచి 7వ తేదీలోగా విద్యార్థులకు కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. అలాగే ఇంటర్మీడియట్‌ బైపీసీలో ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్‌ను పూర్తిచేసినట్లు తెలిపారు. 9951 మంది ఆప్షన్లు పెట్టుకోగా, 3345 మందికి సీట్లు కేటాయించామన్నారు. వారు వెంటనే కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

జేఎన్‌టీయూహెచ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు | Online Certificate Courses at JNTUH

జేఎన్‌టీయూహెచ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు

ముఖ్య సమాచారం

• కోర్సు ఫీజు: రూ.25,000

• అడ్మిషన్‌ ఫీజు: రూ.1000

• దరఖాస్తు ఫీజు: రూ.500

• ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 15

• వెబ్‌సైట్‌: jntuh.ac.in

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్‌) ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌(డీఐఎల్‌టీ)– ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి ఆర్నెల్లు. ప్రతి కోర్సులో మూడు సబ్జెక్టులు, ఒక ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటాయి. అర్హత: ఏదేని డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులు లేదా ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ మెంబర్లు, ఉద్యోగులు, ఫ్రెషర్స్‌ కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం; ఏదేని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి రైటింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Group 1 Group 2 Special గ్రహాలు – లక్షణాలు

గ్రూప్‌–1, గ్రూప్‌–2 ప్రత్యేకం

భూగోళశాస్త్రం

వి.వెంకట్‌రెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ

గ్రహాలు

సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉంటాయి. వీటిలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలు సూర్యునికి, గ్రహశకలాల(ఆస్టరాయిడ్స్‌) పట్టీకి మధ్య ఉన్నందున వాటిని అంతర గ్రహాలు అని పిలుస్తారు. మిగిలిన బృహస్పతి, శని, వరణుడు, ఇంద్రుడు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ప్రత్యామ్నాయంగా, మొదటి నాలుగింటిని టెరెస్ట్రియల్‌ అని పిలుస్తారు. అంటే భూమి లాంటివి. శిలలు, లోహాలతో ఏర్పడి సాపేక్షంగా అధిక సాంద్రత కలిగి ఉంటాయి. అంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. వీటిని భౌమ గ్రహాలు అని కూడా పిలుస్తారు. మిగిలిన నాలుగింటిని జోవియన్‌ లేదా గ్యాస్‌ జెయింట్‌ ప్లానెట్స్‌ అంటారు. జోవియన్‌ అంటే బృహస్పతి లాంటిది. ఇవి చాలా పెద్దవి, దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువగా హీలియం, హైడ్రోజన్‌ వాయువులతో ఏర్పడి ఉన్నాయి.

గ్రహాలన్నీ దాదాపు 4.6 బిలియన్‌ సంవత్సరాల క్రితం ఒకే కాలంలో ఏర్పడ్డాయి. ఇటీవల వరకు(ఆగస్టు 2006), ఫ్లూటోను కూడా ఒకే గ్రహంగా పరిగణించేవారు. అయితే, ఇంటర్నేషనల్‌ ఆస్ట్రానామికల్‌ యూనియన్‌ సమావేశంలో, ఫ్లూటోను ‘మరుగుజ్జు గ్రహం’ అని పిలవవచ్చని నిర్ణయం తీసుకున్నారు. భూమి కక్ష్యను ఆధారం చేసుకొని సౌరకుటుంబంలోని గ్రహాలను రెండు వర్గాలుగా విభజించారు.

1. నిమ్న గ్రహాలు(Inferior Planets): బుధుడు, శుక్రుడు, భూమి

2. పుచ్ఛ గ్రహాలు(Superior Planets): కుజుడు, బృహస్పతి, శని, వరణుడు, నెఫ్ట్యూన్‌

పరిమాణాన్ని ఆధారం చేసుకొని సౌర కుటుంబంలోని గ్రహాల అవరోహణ క్రమం: బృహస్పతి, శని, యురేనస్‌, నెఫ్ట్యూన్‌, భూమి, శుక్రుడు, కుజుడు, బుధుడు.

సూర్యుని నుంచి దూరం ఆధారంగా గ్రహాల వరుస క్రమం: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్‌, నెఫ్ట్యూన్‌.

గ్రహాలు – లక్షణాలు

1. బుధుడు(Mercury): సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం. సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతుంది. ఇది సౌరకుటుంబంలో అతి చిన్న గ్రహం. దీనిని అపోలో, ఉపగ్రహ గ్రహం అని కూడా పిలుస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు. దీని మీద వాతావరణం ఉండదు. దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం అధికంగా గల గ్రహం(పగలు: +400 డిగ్రీల సెల్సియస్‌, రాత్రి: –180 డిగ్రీల సెల్సియస్‌)

2. శుక్రుడు(Venus): ఉదయతార, సంధ్యాతార, వేగుచుక్క ఈ గ్రహానికి ఇతర పేర్లు. దీనిని ‘ఎల్లో ప్లానెట్‌’ అని కూడా పిలుస్తారు. ఇది భూమికి చాలా దగ్గరగా ఉండే గ్రహం. అతి ప్రకాశవంతమైనది. అత్యంత ఉష్ణోగ్రత కలది కూడా. దీనికి ఉపగ్రహాలు లేవు. ఈ గ్రహంపై గ్లోబల్‌ వార్మింగ్‌(గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌) అధికంగా ఉంటుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌(90 శాతం), మీథేన్‌(మార్ష్‌ వాయువు), నైట్రస్‌ ఆక్సైడ్‌(లాఫింగ్‌ గ్యాస్‌) ఈ గ్రహంపై ప్రధానంగా ఉండే వాయువులు. సౌర కుటుంబంలో అత్యంత ఆల్బిడో గల గ్రహం.

నోట్‌: భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చెందించే శక్తి శాతం – ఆల్బిడో.

● సౌర కుటుంబంలో పరిభ్రమణ కాలం కన్నా ఆత్మభ్రమణ కాలం ఎక్కువగా గల గ్రహం ఇది. శుక్రుని పరిభ్రమణ కాలం–23 రోజులు, ఆత్మభ్రమణ కాలం–243 రోజులు. ఈ గ్రహంపై పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి కవల గ్రహం. పరిమాణం, సాంద్రత, ద్రవ్యరాశుల విషయంలో భూమిని పోలి ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు, తన చుట్టూ తాను తిరిగేటప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది.

3. భూమి(Earth): దీనిని నీలి గ్రహం, జలయుత గ్రహం, జీవరాశుల గ్రహం అని పిలుస్తారు. అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి చూస్తే 3వది, పరిమాణంలో 5వ గ్రహం. భూమి ఏకైక ఉపగ్రహం చంద్రుడు.

● చంద్రుని అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు. 1.3 సెకన్లలో చంద్రుని కాంతి భూమిని చేరుతుంది. సూర్యుని తర్వాత మనకు అత్యంత ప్రకాశవంతంగా కన్పించే ఖగోళరాశి. భూమికి అత్యంత సమీపంలో గల ఖగోళ రాసి కూడా. చంద్రునికి, భూమికి మధ్య సగటు దూరం – 3,84,365 కి.మీ. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉన్నప్పుడు దగ్గరగా ఉండే స్థితిని పెరిజీ (Perigee) అంటారు. పెరిజీ స్థితిలో భూమికి, చంద్రునికి మధ్య గల దూరం – 3,64,000. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నప్పుడు దూరంగా ఉన్న స్థితిని అపోజీ(Apogee) అంటారు. అపోజీ స్థితిలో భూమికి, చంద్రునికి మధ్యగల దూరం–4,04,000 కి.మీ. చంద్రుని వ్యాసం – 3,475 కి.మీ. చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాన్ని రెండు విధాలుగా లెక్కిస్తారు.

1. చాంద్ర నక్షత్ర మాసం(Sidereal Month): స్థిర నక్షత్రాల ఆధారంగా చంద్రుడు తన చుట్టూ తాను, భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని ‘చాంద్ర నక్షత్ర మాసం’ అంటారు. ఆ సమయం– 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు

2. చాంద్రమాన మాసం(Senodic Month): సూర్యుని సాపేక్ష స్థానాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను, భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని చాంద్రమాన మాసం అంటారు. ఆ సమయం 29 రోజులు. చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడం వల్ల మనకు చంద్రుని ఒకే ముఖం కనపడుతుంది. చంద్రునిలో మనకు కనిపించేది 59 శాతం మాత్రమే. చంద్రునిపై మాత్రమే దొరికే ఖనిజం ఆర్మాల్‌ కొలైట్‌. అధికంగా దొరికే ఖనిజం టైటానియం. చంద్రునిపై వాతావరణం లేదు. శబ్దం వినపడదు. చంద్రునిపై వాతావరణం లేకపోవడం మూలంగానే పగలు, రాత్రి ఉష్ణోగ్రతలలో అధిక వ్యత్యాసం ఉంటుంది. చంద్రునిపై పగటి ఉష్ణోగ్రత: +125 డిగ్రీ సెల్సియస్‌, రాత్రి ఉష్ణోగ్రత: –150 డిగ్రీ సెల్సియస్‌. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమి చంద్రుడిని బ్లూమూన్‌ అంటారు. ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి బ్లూమూన్‌లు సంభవిస్తాయి. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన దృగ్విషయాన్ని సూపర్‌ మూన్‌ అంటారు. చంద్రుడు పెరిజీ స్థితిలో ఉన్నప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది.

4. కుజుడు(Mars): ఎర్రని గ్రహం, అరుణ గ్రహం, ధూళి గ్రహం దీనికి గల ఇతర పేర్లు. మొత్తం సౌరవ్యవస్థలో ఎత్తయిన పర్వత ప్రాంతం గల గ్రహం ఇది. కుజుడు రోమన్ల యుద్ధ దేవత. భూమి తర్వాత జీవి ఉండవచ్చని భావిస్తున్న గ్రహం. అక్షము, రాత్రి, పగలు విషయాల్లో భూమిని పోలి ఉంటుంది. ఫోబోస్‌, డిమోస్‌ దీని ఉపగ్రహాలు.

5. బృహస్పతి/గురుడు(Jupiter): పరిమాణం పరంగా అతిపెద్ద గ్రహం. ఎక్కువగా ఉల్కలు ఢీకొనడంతో దీనిని ఎర్రని మచ్చలు కలిగిన గ్రహం అంటారు. 1994లో ‘షూమేకర్‌ లెవీ’ అనే తోక చుక్క ఈ గ్రహాన్ని ఢీకొన్నది. ఈ గ్రహానికి గల మరొక పేరు తోక చుక్కల విధ్వంసకారి. గనిమెడ, యూరోపా, కాలిస్టోక్‌, హిమాలియా , లో, దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.

6. శని(Saturn): పరిమాణపరంగా రెండో పెద్ద గ్రహం. దీనిని కనుగొన్న వ్యక్తి గెలీలియో. ఇది అత్యధిక వలయాలు గల గ్రహం. అందమైన గ్రహం అని కూడా పిలుస్తారు. శుభ (Golden Planet), అశుభ గ్రహం(Cruel Planet) అని కూడా అంటారు. నీటి సాంద్రత కంటే ఈ గ్రహం సాంద్రత అతి తక్కువగా ఉంటుంది. ఈ గ్రహానికి మొత్తం 61 ఉప గ్రహాలు ఉన్నాయి. టైటాన్‌, కాలిప్సో, పాన్‌, అట్లాస్‌, జానస్‌ దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.

7. వరుణుడు(Urenus): ఇది ఆకుపచ్చని గ్రహం. దీనిని హర్షెల్‌ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు, తన చుట్టూ తాను తిరిగేటప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. ఈ గ్రహానికి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. మిరిండ్‌, జాలిట్‌, పోర్షియా, ఏరియ్‌, టైటానియా దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.

8. ఇంద్రుడు(Neptune): దీన్ని Baby Blue Planet అంటారు. సూర్యునికి అత్యంత దూరంగా ఉండే గ్రహం. అతి శీతల గ్రహం. దీనికి మొత్తం 13 ఉపగ్రహాలు ఉన్నాయి. ట్రిటాన్‌, తలస్సా, గలాతియా, ప్రోటియస్‌ దీని ముఖ్యమైన ఉపగ్రహాలు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో ఈనెల 25న తుఫాను ఆవర్తనం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంో ఈ నెల 26 నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వెల్లడించింది. అనంతరం ఇది పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలహీన పడుతుందని పేర్కొంది.

తమిళనాడు, కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో మరో తుఫాను ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కృష్ణా, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.

27, నవంబర్ 2023, సోమవారం

పుట్టపర్తికి యధావిధిగా రైలు రాకపోకలు పుట్టపర్తి రైల్వే స్టేషన్ టన్నెల్ప పనులను తాత్కాలికంగా ఆపేసిన రైల్వే అధికారులు

పుట్టపర్తికి యధావిధిగా రైలు రాకపోకలు పుట్టపర్తి రైల్వే స్టేషన్ టన్నెల్ప పనులను తాత్కాలికంగా ఆపేసిన రైల్వే అధికారులు

పుట్టపర్తి మీదుగా వెళ్లే రైలు అన్ని ధర్మవరo  మీదుగా మళ్ళించబడుతాయి అని ప్రకటన చేసిన రైల్వే అధికారులు వెంటనే మరో ప్రకటన చేయడం గమనర్హం. పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న టన్నెల్ప పనులను నిరువదికంగా వాయిదా వేస్తున్నట్లుగా ఈ ప్రకటన సారాంశం. అందువలన పుట్టపర్తి రైల్వే స్టేషన్ మీదుగా రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని రైల్వే అధికారులు నవంబర్ 25వ తేదీన ప్రచురించిన మరో  ప్రకటన ద్వారా అందరికీ తెలియజేశారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Court Assistant, Court Attendant Jobs in District Courts | Last Date to apply for this Job is 21-12-2023 at 5.00 pm | Age Limit is from 18 to 65 years

Click on the below images to view in HD

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Junior Assistant, Stenographer Jobs in District Courts | Age Limit: 18 to 65 years | Last Date to apply for the post is 16-12-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Stenographer Job in District Court Last date to apply - 16-12-2023 at 5pm age limit 18 years to 65 years

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

University: వర్సిటీ నియామకాల ప్రక్రియలో తదుపరి చర్యలొద్దు * వీసీలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం

University: వర్సిటీ నియామకాల ప్రక్రియలో తదుపరి చర్యలొద్దు

* వీసీలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం

హైకోర్టు తీర్పు వచ్చేవరకు అధ్యాపక పోస్టుల భర్తీలో దరఖాస్తుల స్వీకరణ తర్వాతి ప్రక్రియ చేపట్టవద్దని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతు(వీసీ)లను ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఆదేశించారు. ఈ మేరకు వర్సిటీలకు ఆయన లేఖలు పంపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విజయనగరం జేఎన్‌టీయూలో నియామకాల భర్తీ ప్రక్రియ కొనసాగించడంపై ఆ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలను వీసీలందరు పాటించాలని పేర్కొన్నారు. పలు అధ్యాపక పోస్టులకు నిర్వహించిన హేతుబద్ధీకరణ, రిజర్వేషన్‌ రోస్టర్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. డిసెంబరు 4న విచారణ జరగనుంది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు | IB: 995 Assistant Central Intelligence Officer Posts in Intelligence Bureau

IB: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు 

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్‌ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

* అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు (యూఆర్‌- 377, ఈడబ్ల్యూఎస్‌- 129, ఓబీసీ- 222, ఎస్సీ- 134, ఎస్టీ- 133)

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం.

వయోపరిమితి: 15-12-2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.44,900-1,42,400.

ఎంపిక ప్రక్రియ: టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం: టైర్-1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌, టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. టైర్-1 పరీక్షలో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ స్టడీస్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌/ లాజికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ప్రెసిస్‌ రైటింగ్‌ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. 100 మార్కులతో టైర్-3/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.

దరఖాస్తు రుసుము: రూ.550.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రారంభం: 25.11.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2023.

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 19.12.2023.

Important Links

Posted Date: 26-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JNTUH: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు | ఎంపిక ప్రక్రియ: ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ ద్వారా సీటు కేటాయిస్తారు | కోర్సులు: 1. సైబర్‌ సెక్యూరిటీ 2. డేటా సైన్సెస్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ 3. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్

JNTUH: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు 

కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌- నవంబర్‌ 2023 విద్యా సంవత్సరానికి కింది ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు:

1. సైబర్‌ సెక్యూరిటీ

సబ్జెక్టులు: సైబర్‌ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌, ఈ-కామర్స్‌ అండ్‌ డిజిటల్ సెక్యూరిటీ, సైబర్‌ లాస్‌ అండ్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌.

2. డేటా సైన్సెస్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌

సబ్జెక్టులు: ప్రోగ్రామింగ్ యూజింగ్‌ పైథాన్‌, మెషిన్ లెర్నింగ్.

3. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్

సబ్జెక్టులు: పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సెస్‌, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్.

అర్హత: డిప్లొమా/ యూజీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు వ్యవధి: 6 నెలలు.

క్లాస్‌ వర్క్‌ టైమింగ్స్‌(ఆన్‌లైన్‌): ఉదయం 6.30 గం. నుంచి 8.30 గం. వరకు.

ఎంపిక ప్రక్రియ: ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌ ద్వారా సీటు కేటాయిస్తారు.

ఫీజు వివరాలు: రిజిస్ట్రేషన్‌ రూ.500; అడ్మిషన్‌ రూ.1,000; కోర్సు రూ.25,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.

అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా‌ (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 26-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట..మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత | లోహపు వ్యర్థాలతో రామాలయం! | అయ్యప్ప భక్తుల కోసం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో 'అయ్యన్' యాప్ 2,500 kg heavy bell for Ayodhya Ram..Its special feature is the omkara sound when it is rung. Ram temple with metal waste! | 'Aiyan' app available in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi languages for Ayyappa devotees

అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట
అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం. ఇందు కోసం రూ.25 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. మోగించినపుడు ఓంకార శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జింక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేశామని చెప్పారు. దీని తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారని.. సుమారు మూడు నెలలు పట్టిందని నిర్వాహకులు వెల్లడించారు.

లోహపు వ్యర్థాలతో రామాలయం!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్ లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరాన్ని నిర్మించారు కొందరు శిల్పకారులు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది మూడు నెలల పాటు శ్రమించి.. ఇనుప స్తంభాలు, లోహపు వ్యర్థాలతో రామమందిర నమూనాను తయారు చేశారు. ఈ మందిరాన్ని 27 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు. మొత్తం 20 టన్నుల ఇనుమును వాడినట్లు శిల్పకారులు తెలిపారు.

అయ్యప్ప భక్తుల కోసం 'అయ్యన్' యాప్ 
• అందుబాటులోకి తెచ్చిన కేరళ అటవీ శాఖ శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ 'అయ్యన్' యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో పనిచేసేలా దీన్ని  పొందించారు. గూగుల్ ప్లేస్టోర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్ ఎమర్జెన్సీ వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్ పోలీస్ ఎయిడ్ పోస్ట్లు, తాగునీటి కేంద్రాల వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అటవీ ఈ దాడి మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యమృగాలు చేసినట్లయితే.. ఈ యాప్ను ఉపయోగించి వెంటనే అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

ప్రభుత్వ ఉద్యోగాలు | స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా సాయుధ బలగాల్లో 26,146 పోస్టులు | బెంగళూరులో టీచింగ్‌ ఉద్యోగాలు | జూనియర్‌ రెసిడెంట్లు - ఉద్యోగాలు | Government Jobs | 26,146 posts in armed forces by Staff Selection Commission Teaching Jobs in Bangalore | Junior Residents - Jobs

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌/ రైఫిల్‌మ్యాన్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. 

సాయుధ బలగాల్లో 26,146 పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌/ రైఫిల్‌మ్యాన్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. 

1. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌): 6,174  (పురుషులు- 5,211; మహిళలు- 963)

2. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌): 11,025 (పురుషులు- 9,913; మహిళలు- 1,112)

3. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌): 3,337  (పురుషులు- 3,266; మహిళలు- 71)

4. సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ): 635 (పురుషులు- 593; మహిళలు- 42)

5. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ): 3,189  (పురుషులు- 2,694; మహిళలు- 495)

6. అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌): 1,490 (పురుషులు- 1,448; మహిళలు- 42)

7. సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌): 296 (పురుషులు- 222; మహిళలు- 74)

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయసు: జనవరి 01, 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

వాక్‌-ఇన్స్‌

బెంగళూరులో టీచింగ్‌ ఉద్యోగాలు

బెంగళూరు, రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ పీజీఐఎంఎస్‌ఆర్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన 7 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌: 01  
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 05
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 01  

విభాగాలు: ఆర్థోపెడిక్స్‌, రేడియో-డయాగ్నోసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పాథాలజీ.

అర్హత: మెడికల్‌ పీజీ.

వయసు: 67 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,39,607, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,59,334, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,36,889

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 01-12-2023.

వేదిక: న్యూ అకడమిక్‌ బ్లాక్‌, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ పీజీఐఎంఎస్‌ఆర్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.

జూనియర్‌ రెసిడెంట్లు

బెంగళూరు రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన 6 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌. వయసు: 30 ఏళ్లు మించకుడదు.

వేతనం: నెలకు రూ.1,10,741  

ఇంటర్వ్యూ తేదీ: 05-12-2023.

వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/recruitments

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IDBI - ఉద్యోగాలకు ఆహ్వానం | 2100 కొలువులు | ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీవిద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!

ఉద్యోగార్థులకు ఐడీబీఐ ఆహ్వానం!

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీవిద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!

2100 కొలువులు

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 2100 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 800 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌, 1300 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ
విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం సొంతమవుతుంది!

డీబీఐ పోస్టులకు జనరల్‌ అభ్యర్థులు పోటీ పడటానికి గరిష్ఠ వయసు 25 ఏళ్లు మాత్రమే. ఐబీపీఎస్‌ ద్వారా జరిగే బ్యాంకు పీవో పోస్టులకు మాత్రం అన్‌ రిజర్వ్‌డ్‌ వర్గాలకు 30 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పరీక్షకు పోటీ కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్‌ పరీక్ష కూడా లేకపోవడం కలిసొచ్చే అంశమే. ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అయితే వీరి పనితీరు ప్రకారం రెండేళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవచ్చు. రెండు పోస్టులకూ.. ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ప్రి రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు మాత్రం ఇంటర్వ్యూ అదనం.

ఆన్‌లైన్‌ పరీక్ష

రెండు పోస్టులకూ పరీక్ష విధానం ఒక్కటే. మొత్తం 200 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 200 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌లో 60, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌/ ఐటీ విభాగంలో 60 ప్రశ్నల చొప్పున వస్తాయి. వీటిని ఆబ్జెక్టివ్‌ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలుంటాయి. సెక్షన్ల వారీ సమయ నిబంధన లేదు.

ఇంటర్వ్యూ, తుది ఎంపిక

ఆన్‌లైన్‌ పరీక్షలో సెక్షన్లవారీ, మొత్తం మీద కనీస మార్కులు పొందాలి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంతమందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది.

ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 మార్కులు రావాలి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులు పొందినవారు పరీక్షలో సాధించిన మార్కుల్లో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోరులో 1/4 వంతు మార్కులు కలిపి మెరిట్‌ జాబితా రూపొందించి, ఉద్యోగానికి తీసుకుంటారు.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు మాత్రం పరీక్షలో చూపిన ప్రతిభతో ధ్రువ పత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.  

వేతనం

జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’కు ఎంపికైనవారికి క్లాస్‌ ఏ సిటీలో అయితే ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షలు అందుతుంది. వీరు ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. మూడేళ్ల సర్వీస్‌తో గ్రేడ్‌ ‘ఏ’ హోదా పొందుతారు. అదే ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌లో చేరినవారికి మొదటి ఏడాది ప్రతి నెలా రూ.29,000, రెండో ఏట రూ.31,000 చొప్పున చెల్లిస్తారు. అయితే రెండేళ్ల సేవలు అనంతరం వీరిని కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’ పోస్టులకు ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. బ్యాంకు నిర్వహించే ఎంపిక పరీక్షలో విజయవంతమైతే వీరినీ శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు.

ముఖ్య వివరాలు  

ఖాళీలు: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ 800. (అన్‌ రిజర్వ్‌డ్‌ 324, ఓబీసీ 216, ఎస్సీ 120, ఎస్టీ 60, ఈడబ్ల్యుఎస్‌ 80). ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ 1300. (అన్‌ రిజర్వ్‌డ్‌ 558, ఓబీసీ 326, ఎస్సీ 200, ఎస్టీ 86, ఈడబ్ల్యుఎస్‌ 130).

విద్యార్హత: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు 60 (ఎస్సీ, ఎస్టీలైతే 55) శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది.

వయసు: నవంబరు 1, 2023 నాటికి 20 - 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే నవంబరు 2, 1998 - నవంబరు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 6  

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్లకు డిసెంబరు 31. ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులకు డిసెంబరు 30.

ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200. మిగిలిన అందరికీ రూ.1000

వెబ్‌సైట్‌ : https://ibpsonline.ibps.in/idbiesonov23/

ఇదీ సిలబస్‌

లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: నాన్‌ వెర్బల్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మన్‌ అవుట్‌, క్లాక్‌, క్యాలెండర్‌, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్‌, డైస్‌, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్‌, పజిల్స్‌, సిలాజిజమ్‌, ర్యాంకింగ్‌, సీక్వెన్స్‌, సింబాలిక్‌ ఆపరేషన్స్‌, నెంబర్‌ ఎనాలజీ, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్‌, నంబర్‌ క్లాసిఫికేషన్‌, సిరీస్‌, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే గణితంలోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.

జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/ కంప్యూటర్‌/ ఐటీ: బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం. అందువల్ల.. ఆర్‌బీఐ, బ్యాంక్‌ పదజాలం, బీమా, రెపో, రివర్స్‌ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు-అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుËగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు..ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎకనామిక్స్‌లో ప్రాథమికాంశాలు చదువుతూ, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్‌/ఐటీలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. బ్యాంకు కార్యకలాపాలకు అవసరమయ్యే కనీస సాంకేతిక పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలిస్తారు.  

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, కాలం-పని, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్‌, షార్ట్‌ కట్స్‌ ఉపయోగించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా జవాబు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్టు, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌ నుంచి కొన్ని, వ్యాకరణాంశాల నుంచి వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, సిననిమ్స్‌- యాంటనిమ్స్‌, వాయిస్‌, డైరెక్ట్‌, ఇండైరెక్ట్‌ స్పీచ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు.

సన్నద్ధత ఇలా..

  • పరీక్షకు సుమారు 33 రోజుల వ్యవధే ఉంది. ఈ తక్కువ సమయం ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి మంచి అవకాశం.  
  • ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తాజా అభ్యర్థులు ముందుగా పరీక్షలో పేర్కొన్న విభాగాలకు సంబంధించి ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. అనంతరం ఎక్కువ మార్కులు సాధించడానికి అనువైన అంశాలను పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అంశాలు అధ్యయనం చేయాలి.
  • పరీక్షలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  • విభాగాల వారీ ఉన్న అంశాలను 23 రోజుల్లో పూర్తిచేసుకోవాలి. చివరి పది రోజులు మాక్‌ టెస్టులకు కేటాయించాలి. ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ పీవో పాత ప్రశ్నపత్రాలనూ బాగా సాధన చేయాలి.  
  • 200 ప్రశ్నలకు 120 నిమిషాలు అంటే ప్రతి ప్రశ్నకూ కేవలం 36 సెకన్ల వ్యవధే ఉంటుంది. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు ఈ సమయం సరిపోదు. అందువల్ల ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసి, అక్కడ మిగుల్చుకున్న సమయాన్ని ఈ విభాగాలకు కేటాయించగలిగితేనే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలరు.
  • మాక్‌ టెస్టులతో పరీక్ష విధానానికి అలవాటు పడటమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. దాని ప్రకారం ఎంత వేగంతో సమాధానం ఇవ్వాలో అర్థం చేసుకుని, సన్నద్ధత మెరుగుపరచుకోవాలి.
  • సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే విభాగం/ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే ఎక్కడ తప్పులు చేస్తున్నారో గుర్తించి, వాటిని తర్వాత పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా విశ్లేషించుకుంటూ పరీక్షకు సిద్ధమైతే తక్కువ వ్యవధిలోనే అంశాలు, సమయ పాలనపై పట్టు సాధించవచ్చు.
  • రుణాత్మక మార్కులు ఉన్నందున ఏ మాత్రం తెలియని ప్రశ్నను వదిలేయడమే మంచిది.