ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్‌ఏఎస్) 906 సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులను భర్తీచేయనుంది. | Airports Authority of India Cargo Logistics and Allied Services Company Limited (AICLAS) is going to fill 906 Security Screener (Fresher) Posts.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్‌ఏఎస్) 906 సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులను భర్తీచేయనుంది.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్‌ఏఎస్) 906 సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులను భర్తీచేయనుంది. దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
01.11.2023 నాటికి 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన జనరల్ అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 55 శాతం మార్కులు సరిపోతాయి.
- ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసే, మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
- 01.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
- ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌పోర్టులు, కార్గో కాంప్లెక్సుల్లో కార్గో స్క్రీనింగ్, సెక్యూరిటీ విధులను నిర్వర్తించాలి.
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
ఎంపిక విధానం
గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 3 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను.. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్‌లో మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. ఏడాదిపాటు ప్రొబేషన్ వర్తిస్తుంది. ఈ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు కొన్ని కోర్సుల్లో శిక్షణనిస్తారు. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి.
- ఏవీఎస్‌ఈసీ ఇండక్షన్ కోర్స్ - 5 రోజులు
- ఎట్ ఎయిర్‌పోర్ట్/ఆర్‌ఏ - మూడు నెలలు
- ఏవీఎస్‌ఈసీ బేసిక్ కోర్స్ - 14 రోజులు
- ఎట్ ఎయిర్‌పోర్ట్ - నెల రోజులు
- స్క్రీనర్స్ ప్రీ-సర్టిఫికేషన్ కోర్సు - 3 రోజులు
- టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ స్క్రీనర్ - 2 రోజులు
ఈ శిక్షణలన్నింటినీ ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేయాలి. ఒక్కో పరీక్షను రెండు ప్రయత్నాల్లో పూర్తిచేయొచ్చు. మొదటి ప్రయత్నంలో విఫలమైనట్టయితే అభ్యర్థి స్టైపెండ్‌ను నెలకు రూ.15,000 నుంచి రూ.10,000 తగ్గిస్తారు. రెండుసార్లూ విఫలమైనట్లయితే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తారు.
శిక్షణను పూర్తిచేసుకున్న అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30,000 వేతనం చెల్లిస్తారు. రెండో ఏడాది రూ.32,000, మూడో ఏడాది రూ.34,000. దీనికి అదనంగా టూర్లకు వెళ్లినప్పుడు టీఏ/డీఏ/లాడ్జింగ్, బోర్డింగ్ సదుపాయాలూ ఉంటాయి. ఉద్యోగికీ, కుటుంబ సభ్యులకూ వర్తించే విధంగా పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయాలు ఉంటాయి.
ఎంపికైన అభ్యర్థులను సంస్థ పాలనాపరమైన అవసరాల నిమిత్తం చెన్నై, కోల్‌కతా, గోవా, కోజీకోడ్ (కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదరా, మదురై, తిరుపతి, రాయ్‌పుర్, వైజాగ్, ఇందౌర్, అమృత్‌సర్, భువనేశ్వర్, అగర్తలా, పోర్ట్‌బ్లెయిర్, తిరుచి, దెహ్రాదూన్, పుణె, సూరత్, లేహ్, పట్నాల్లో ఎక్కడైనా నియమించవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.12.2023
వెబ్‌సైట్: www.aaiclas.aero
కామెంట్‌లు