28, నవంబర్ 2023, మంగళవారం

జేఎన్‌టీయూహెచ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు | Online Certificate Courses at JNTUH

జేఎన్‌టీయూహెచ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు

ముఖ్య సమాచారం

• కోర్సు ఫీజు: రూ.25,000

• అడ్మిషన్‌ ఫీజు: రూ.1000

• దరఖాస్తు ఫీజు: రూ.500

• ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 15

• వెబ్‌సైట్‌: jntuh.ac.in

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్‌) ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌(డీఐఎల్‌టీ)– ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ విత్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సు వ్యవధి ఆర్నెల్లు. ప్రతి కోర్సులో మూడు సబ్జెక్టులు, ఒక ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటాయి. అర్హత: ఏదేని డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులు లేదా ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ మెంబర్లు, ఉద్యోగులు, ఫ్రెషర్స్‌ కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం; ఏదేని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి రైటింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: