అంతర్జాతీయ స్థాయిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎసీసీ) చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఏపీ ఎస్ఓసీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఇండియా స్కిల్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది 40 విభాగాల్లో నైపుణ్య ప్రదర్శనకు ఏపీఎస్ఎస్ఓసీ అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో విజేతలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ స్థాయిలో గెలిచినవారు ఫ్రాన్స్లోని లియోన్లో 2024లో జరిగే అంతర్జాతీయ వేదికలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 2021లో జాతీయ స్థాయిలో
17 పతకాలు సాధించి అయిదవ స్థానంలో నిలిచిన ఏపీ ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తిగల యువత డిసెంబర్ 15లోగా https://skilluniverse.apssdc.in/world-skill-registration
అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిందిగా ఏపీఎస్ఎస్ఓసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఏపీఎస్ఎస్ఓసీ వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి