University: వర్సిటీ నియామకాల ప్రక్రియలో తదుపరి చర్యలొద్దు * వీసీలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం
University: వర్సిటీ నియామకాల ప్రక్రియలో తదుపరి చర్యలొద్దు
* వీసీలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం
హైకోర్టు తీర్పు వచ్చేవరకు అధ్యాపక పోస్టుల భర్తీలో దరఖాస్తుల స్వీకరణ తర్వాతి ప్రక్రియ చేపట్టవద్దని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతు(వీసీ)లను ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఆదేశించారు. ఈ మేరకు వర్సిటీలకు ఆయన లేఖలు పంపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విజయనగరం జేఎన్‌టీయూలో నియామకాల భర్తీ ప్రక్రియ కొనసాగించడంపై ఆ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలను వీసీలందరు పాటించాలని పేర్కొన్నారు. పలు అధ్యాపక పోస్టులకు నిర్వహించిన హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. డిసెంబరు 4న విచారణ జరగనుంది.
కామెంట్‌లు