ప్రభుత్వ ఉద్యోగాలు | డీఆర్‌డీవోలో ప్రాజెక్ట్ పోస్టులు | గ్రూప్-ఏ, బీ, సీ ఖాళీలు | ఏలూరులో పారామెడికల్ పోస్టులు | ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 72 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | సివిల్ సప్లైస్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌లు | ఏపీఎస్సీఎస్సీఎల్‌లో అకౌంటెంట్‌లు | Government Jobs | Project Posts in DRDO | Group-A, B, C Vacancies | Paramedical Posts in Eluru | Applications are invited for filling up 72 various posts in Medical Institutions in Joint Anantapur District. | Technical Assistants in Civil Supplies | Accountants in APSCSCCL |
ప్రభుత్వ ఉద్యోగాలు
డీఆర్‌డీవోలో ప్రాజెక్ట్ పోస్టులు
హైదరాబాదులోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో).. కాంట్రాక్టు ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్: 01
- ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్: 05
- ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్: 05
అర్హత: డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్‌సీ/ బీసీఏ)తో పాటు పని అనుభవం.
వయసు: 56 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.
వెబ్‌సైట్: https://www.drdo.gov.in
గ్రూప్-ఏ, బీ, సీ ఖాళీలు
ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్)... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రూప్ ఎ పోస్టులు
1. డిప్యూటీ డైరెక్టర్
2. అసిస్టెంట్ డైరెక్టర్
3. అకడమిక్ ఆఫీసర్
గ్రూప్ బి పోస్టులు
4. సెక్షన్ ఆఫీసర్
5. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
6. ఈడీపీ సూపర్‌వైజర్
7. గ్రాఫిక్ ఆర్టిస్ట్
8. జూనియర్ ఇంజినీర్
గ్రూప్ సి పోస్టులు
9. అసిస్టెంట్స్
10. స్టెనోగ్రాఫర్
11. జూనియర్ అసిస్టెంట్స్
12. మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం ఖాళీలు: 62
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2023.
వెబ్‌సైట్: www.nios.ac.in
ఏలూరులో పారామెడికల్ పోస్టులు
ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడింది.
ఆఫీస్ సబార్డినేట్స్, ఈఎంటీ, కంప్యూటర్ ప్రోగ్రామర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఫార్మసిస్ట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత మార్కులు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, ఏలూరు’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 11-12-2023.
వెబ్‌సైట్: https://eluru.ap.gov.in/notice_category/ recruitment
ల్యాబ్ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 72 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వైద్య సంస్థలు: ప్రభుత్వ వైద్య కళాశాల/ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (అనంతపురం), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (అనంతపురం), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (అనంతపురం).
ఖాళీలు: ల్యాబ్ అటెండెంట్స్, నర్సింగ్ ఆర్డర్లీ, అటెండర్, డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత మార్కులు, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, అనంతపురం’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 4-12-2023.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/
సివిల్ సప్లైస్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌లు
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన 12 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్ / బయోటెక్నాలజీ/ డ్రైల్యాండ్ అగ్రికల్చర్/ బాటనీ).
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ‘డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 5-12-2023.
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/
ఏపీఎస్సీఎస్సీఎల్‌లో అకౌంటెంట్‌లు
నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం- కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- అకౌంటెంట్ గ్రేడ్ III: 02
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
అర్హత: డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంకాం.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్, వేదాయపాళెం, నెల్లూరు’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/
కామెంట్‌లు