బంగాళాఖాతంలో అల్పపీడనం - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో ఈనెల 25న తుఫాను ఆవర్తనం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంో ఈ నెల 26 నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వెల్లడించింది. అనంతరం ఇది పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలహీన పడుతుందని పేర్కొంది.
తమిళనాడు, కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో మరో తుఫాను ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కృష్ణా, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
కామెంట్‌లు