11, ఫిబ్రవరి 2021, గురువారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల గురించి సమాచారం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తోంది!

Edu newsగతేడాది నిర్వహించిన.. డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ రాత పరీక్షల ఫలితాలు కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది. ఆ వెంటనే.. ఎంపిక ప్రక్రియలో తుది దశగా నిలిచే ఇంటర్వ్యూల నిర్వహణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల పదో తేదీ నుంచి డిగ్రీ లెక్చరర్స్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తేదీల వారీగా ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అలాగే మరికొద్ది రోజుల్లో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్‌లకు కూడా ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు మార్గాలు...

ఇప్పుడు ఈ అభ్యర్థులంతా పదో తేదీ నుంచి జరుగనున్న ఇంటర్వ్యూలో నెగ్గాలంటే.. వ్యక్తిత్వ లక్షణాల నుంచి ప్రొఫెషనల్ నైపుణ్యాల వరకూ.. అన్నింటా మెరుగులు దిద్దుకొని సిద్ధమవ్వాలి.

ముందుగా ధ్రువపత్రాలు...
డిగ్రీ లెక్చరర్ పోస్ట్‌ల ఇంటర్వ్యూకు హాజరుకానున్న అభ్యర్థులు సర్వీస్ కమిషన్ పేర్కొన్న నిబంధనల ప్రకారం-ముందుగా ఆయా ధ్రువ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన చెక్ లిస్ట్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. దాన్ని నింపాలి. దీంతోపాటు అకడమిక్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ ప త్రాలు, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసు కోవాలి. ఇంటర్వ్యూ నిర్వహణకు ముందు ఆయా సెషన్ల వారీగా నిర్దిష్ట సమయంలో సర్టిఫి కెట్‌ల వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.

రోజుకు రెండు సెషన్లు..
ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం -ఈ నెల పదో తేదీ నుంచి 25వ తేదీ వరకూ.. ప్రతి రోజు రెండు సెషన్లలో డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ తేదీ ల్లో ప్రతిరోజు మొదటి సెషన్ ఇంటర్వ్యూ 11గంటలకు; రెండో సెషన్ ఇంటర్వ్యూ మధ్యాహ్నం 2:30కు ప్రారంభమవుతుంది. మొదటి సెషన్ సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్ ఉదయం 8గంటలకు; రెండో సెషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ 11 గంటలకు మొదలవుతుంది. అంటే..సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ రెండూ ఒకేరోజు జరుగనున్నాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగానే అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకొని.. ఇంటర్వ్యూకు వెళ్లాలి. లేదంటే.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఒత్తిడికి గురయ్యే ఆస్కార ముంది. అది ఇంటర్వ్యూలో ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంది. అంతేకాకుండా సమయానికి నిర్దేశిత సర్టిఫికెట్లు లేకున్నా.. ఇంటర్వ్యూ అవకాశం చేజారే ప్రమాదం కూడా ఉంది.

ఏపీపీఎస్‌సీ తేదీలు, సెషన్ల వారీగా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రతిరోజు రెండు సెషన్లుగా... ఒక్కో సెషన్‌లో కనిష్టంగా 23 మంది.. గరిష్టంగా 25 మందికి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
Career guidance

అంటే.. ఒక్కో అభ్యర్థికి ఇంటర్వ్యూ చేసే సమయం సగటున 20 నిమిషాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ సమయం మరో అయిదు నుంచి పది నిమిషాలు పెరిగినా ఆశ్చర్యపోన క్కర్లేదు. సదరు అభ్యర్థి ఇచ్చే సమాధానాలు, బోర్డ్ సభ్యుల దృక్పథంపై ఇంటర్వ్యూ సమయం ఆధారపడి ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు సగటున 25 నిమిషాల పాటు ఇంటర్వ్యూను ఎదుర్కొనేందుకు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి.

పర్సనల్, అకడమిక్ సమ్మిళితంగా ఇంటర్వూ ప్రిపరేషన్ ఉండాలి..!

పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇంటర్వ్యూల్లో.. అభ్యర్థి వ్యక్తిగత విషయాలు, అకడమిక్ నేపథ్యా లపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఇదే పంథా డిగ్రీ లెక్చరర్స్ ఇంటర్వ్యూల్లోనూ కొనసాగే అవకాశం ఉంది.
Career guidance
కాబట్టి అభ్యర్థులు తమ పర్సనల్ ప్రొఫైల్‌కు సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా కుటుంబ నేపథ్యం, ప్రాంతం, హాబీలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా అకడమిక్ ప్రొఫైల్‌కు సంబంధించి సబ్జెక్ట్ నైపుణ్యాలు.. ఆ సబ్జెక్ట్‌పై తమకున్న ఆసక్తికి కారణం, సదరు సబ్జెక్ట్ పరంగా ఇప్పటి వరకు సాధించిన ప్రత్యేక అర్హతల గురించి అడిగితే.. తొణకకుండా సమాధానాలు చెప్పగలగాలి. పని అనుభవం ఉంటే.. అప్పటివరకు బోధించిన తరగతుల స్థాయి.. తాము బోధించిన సబ్జెక్ట్‌లలో విద్యార్థులు చూపిన ప్రతిభ వంటి వాటితో సిద్ధంగా ఉండాలి.

ప్రాంతీయ నేపథ్యం..
ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు.. తమ ప్రాంతం గురించి ఆసాంతం తెలుసుకోవాలి. అభ్యర్థుల బయోడేటా ఆధారంగా వారి ప్రాంతీయ నేపథ్యంపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు తమ ప్రాంత ప్రత్యేకతలు, అక్కడ ఉన్న వనరులు, సంస్కృతి, సమస్యలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. డిగ్రీ లెక్చరర్ పోస్ట్‌లకు హాజరయ్యే అభ్యర్థులకు వారి ప్రాంతాల్లోని ఉన్నత విద్య పరిస్థితులపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తమ ప్రాంతంలో విద్యా రంగానికి సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోవాలి. మీ ప్రాంతంలో ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు.. ఎన్‌రోల్‌మెంట్ రేషియో ఎలా ఉంది? మీ ప్రాంతంలోని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి.. తదితర ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

డిగ్రీ లెక్చరర్ ఇంటర్వ్యూలో ఈ నైపుణ్యాలు ఉన్న వారికే ప్రాధాన్యత..!

డిగ్రీ లెక్చరర్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు.. తమ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి.
Edu news

బోర్డ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనుగుణంగా తమ సమాధానాలు చెప్పే సమయంలో భావ వ్యక్తీకరణ స్పష్టంగా, సూటిగా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా ఒక ప్రశ్నకు సంబంధించి బోర్డ్ సభ్యుల వాదనను వ్యతిరేకించాల్సి వస్తే.. దాన్ని సున్నితంగా, బోర్డ్ సభ్యులను మెప్పించేలా చెప్పాలి. అలాకాకుండా వాదనకు దిగడంవల్ల ప్రతికూలత పెరుగుతుంది.

డిగ్రీ లెక్చరర్ ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు.. ఇప్పటికే పని అనుభవం గడించి ఉంటే.. తమ బోధన విధానం, ఏదైనా విషయాన్ని విద్యా ర్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పే తీరు గురించి కూడా బోర్డ్‌కు వివరించాలి.


చర్చ మాదిరిగా..
ఇంటర్వ్యూ కొన్ని సందర్భాల్లో ప్రశ్నకు సమాధానం ఇచ్చే విధంగా కాకుండా.. చర్చ మాదిరిగా సాగే అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా ఒక అంశం లేదా సమస్య గురించి అడిగినప్పుడు.. దాని ప్రాధాన్యం ఆధారంగా నేరుగా సమాధానం ఇవ్వాలా? లేదా కొంత వివరణ అవసరమా..! అని ఆలోచించాలి. బోర్డ్ సభ్యులే చర్చ మాదిరిగా ఒక అంశాన్ని లేవనెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనికి కూడా సిద్ధమై బోర్డ్ రూమ్‌లోకి అడుగు పెట్టాలి.

బాడీలాంగ్వేజ్ ముఖ్యమే..
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బాడీ లాంగ్వేజ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హావభా వాలు హుందాగా ఉండాలి. ఎదుటి వారిని మెప్పించే రీతిలో వ్యవహరించాలి. అదే విధంగా వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తమకు నప్పే,ఎదుటి వారిని మెప్పించే విధంగా వస్త్రధారణ ఉండాలి. బోర్డ్ రూమ్‌లోకి అడుగు పెట్టాక.. బోర్డ్ చైర్మన్‌తోపాటు మిగిలిన సభ్యులందరినీ విష్ చేయడం ఎంతో ముఖ్యం. అదే విధంగా సమాధానా లు చెప్పే సమయంలోనూ ప్రశ్న అడిగిన బోర్డ్ సభ్యుడితోపాటు ఇతర సభ్యులను కూడా చూస్తూ మాట్లాడాలి. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత బోర్డ్ సభ్యులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ బయటికి రావాలి.

పాలిటెక్నిక్ లెక్చరర్స్ వినూత్నంగా.. ఈ నైపుణ్యాలపై పట్టు పెంచుకోవాలి..

ఏపీపీఎస్‌సీ..త్వరలోనే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్‌లకు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ఎంపికైన అభ్యర్థులు.. ఇప్పటి నుంచే అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. డిగ్రీ లెక్చరర్స్ ఇంటర్వ్యూలతో పోల్చితే.. పాలిటెక్నిక్ లెక్చరర్ ఇంటర్వ్యూలు కొంత వినూ త్నంగా, భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

టెక్ అంశాలపై పట్టు..
పాలిటెక్నిక్ లెక్చరర్ ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు.. టెక్నికల్ సంబంధిత అంశాలపై పట్టు సాధించడం మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈసీఈ, సీఎస్‌ఈ, మెకా నికల్ వంటి పోస్ట్‌లకు హాజరవనున్న అభ్యర్థులు.. ఈ రంగాల్లో తాజా పరిణామాలు, ఇటీవల కాలంలో ప్రాముఖ్యం సంతరించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్, ఆటోమేషన్ తదితర డిజిటల్ స్కిల్స్ గురించి అవగాహన ఏర్పరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ ఇంటర్వూకి ప్రిపేర్ అయ్యే వాళ్లు.. దీనిపై దృష్టి పెట్టడం మంచిది..

డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్.. ఇలా రెండు పోస్ట్‌ల ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థులు.. కరెంట్ అఫైర్స్‌పై తప్పనిసరిగా పట్టు సాధించాలి. ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సంఘటనలు, తాజా బడ్జెట్, ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు, ప్రభుత్వ పథకాలు.. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలవుతున్న పథకాలు-వాటి లక్షిత వర్గాలు, లబ్ధ్దిదారులు, ఇప్పటి వరకు ప్రయోజనం పొందిన వారు, ఈ పథకాలకు కేటాయిస్తున్న బడ్జెట్ తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులు.. తాజాగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సీన్ల గురించి కూడా తెలుసుకోవాలి.

  1. ఇంటర్వ్యూ రోజున కనీసం రెండు దినపత్రికలు (తెలుగు, ఇంగ్లిష్) చదవాలి. ఎడిటోరియల్స్, ఇతర ముఖ్య వార్తలు గుర్తించి.. వాటి ప్రాధాన్యం గురించి వివరించేందుకు సిద్ధంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో బోర్డ్ సభ్యులు.. ఆ రోజు దిన పత్రికలోని ప్రధాన వార్తలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు తమ సెషన్ ఏ తేదీన ఉందో.. ఆ రోజు తప్పనిసరిగా న్యూస్ పేపర్లు చదవడం ఎంతో ముఖ్యం అని గుర్తించాలి.


డిగ్రీ లెక్చరర్స్ ఇంటర్వ్యూ తేదీలు..

  1. ఫిబ్రవరి 10, 11, 12, 15, 16, 18, 19, 22, 23, 24, 25 తేదీల్లో
  2. ప్రతి రోజు రెండు సెషన్లలో ఇంటర్వ్యూ..
  3. మొదటి సెషన్ ఇంటర్వ్యూలు ఉదయం 11 గంటలకు, రెండో సెషన్ ఇంటర్వ్యూలు 2:30 గంటలకు ప్రారంభం.
  4. సర్టిఫికెట్ వెరిఫికేషన్.. మొదటి సెషన్ అభ్యర్థులకు ఉదయం 8 గంటలకు, రెండో సెషన్ అభ్యర్థులకు ఉదయం 11 గంటలకు మొదలవుతుంది.
  5. వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in

కామెంట్‌లు లేవు: