13, ఫిబ్రవరి 2021, శనివారం

ప్రస్తుత తిరుమలలో వాతావరణం

అంతా స్వామి వారి దయ 🙏🙏🙏
 భక్త ప్రవాహం బాగానే ఉంది. రూమ్స్ చాలా ఉన్నాయి కానీ అధికారులు మంజూరు చేయడం లో ఆలస్యం చేస్తున్నారు. ఉచిత బస్సులు 12కు గాను 9 నడుస్తున్నాయి ప్రస్తుతానికి. తినడానికి ఢోకా లేదు వెంగమాంబ సత్రం ఉంది కావున, బయట అడ్డగోలుగా ఉన్నాయి ధరలు తిండికి. తలనీలాలు త్వరగానే అవుతున్నాయి. వరాహ స్వామి , హయగ్రీవ స్వామి వారి దేవాలయాలు మూసి ఉన్నాయి.మ్యూజియం ఇతర చుట్టూ ప్రక్కల ప్రాంతాలు 5 లోపు వరకు అనుమతులు ఉన్నాయి. తిరుమల వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక నెల క్రితం నిర్ణయించుకుంటే గనుక హ్యాపీగా గా వెళ్లి రావచ్చు. స్లాట్ కంటే 1,2 గంటల ముందు వెళ్ళినా కూడా అనుమతి ఉంది. రూం లు కూడా చాలా బాగున్నాయి. లడ్డూల కౌంటర్ దగ్గర రద్దీ బాగా ఉంది. సహస్ర దీపాలంకరణ మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు కనువిప్పుకలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమములు కూడా అవుతున్నాయి. చలి కూడా విపరీతంగా ఉంది. తిరుమలలో ఉన్నంత సేపు ఏదో తెలియని చక్కటి అనుభూతి. మాస్క్ సనిటైజర్ అస్సలు గుర్తే లేవు. అంతా స్వామి వారి మహిమ 🙏
ఓం నమో వేంటేశాయ నమః

కామెంట్‌లు లేవు: