13, ఫిబ్రవరి 2021, శనివారం

ఎన్‌వైకేఎస్‌లో 13,206 వాలంటీర్ పోస్టులు.. చివరి తేది ఫిబ్రవరి 20

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్(ఎన్‌వైకేఎస్).. 2021-2022 సంవత్సరానికి నెహ్రూ యువ వాలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 13,206
అర్హత: కనీసం పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2021 నాటికి 18-29 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఉన్నత విద్యార్హతలు, మెరిట్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బేసిక్ నాలెడ్‌‌జ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడకం, వివిధ యాప్స్ (ఈ-బ్యాంకింగ్/డిజిధన్, సోషల్ మీడియా తదితరాలు) గురించి బేసిక్ నాలెడ్‌‌జ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం: నెలకు రూ.5000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 20, 2021.
ఫలితాల వెల్లడి తేది: మార్చి 15, 2021.
జాయినింగ్ తేది: ఏప్రిల్ 1, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://nyks.nic.in/

కామెంట్‌లు లేవు: