10, ఫిబ్రవరి 2021, బుధవారం

ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి

ఫిబ్రవరి 19వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. 

ఆ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, 'రథసప్తమి'ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

సమయం             వాహనం

ఉ. 5.30 - ఉ. 08.00   సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.38 గంటలుగా నిర్దేశించడమైనది)

ఉ. 9.00 - ఉ. 10.00        చిన్నశేష వాహనం

ఉ. 11.00 - మ. 12.00 గరుడ వాహనం

మ. 1.00 - మ. 2.00         హనుమంత వాహనం

మ. 2.00 - మ. 3.00          చక్రస్నానం

సా. 4.00 - సా. 5.00          కల్పవృక్ష వాహనం

సా. 6.00 - సా. 7.00           సర్వభూపాల వాహనం

రా. 8.00 - రా. 9.00           చంద్రప్రభ వాహనం

ఆర్జితసేవలు రద్దు :

        శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.

కామెంట్‌లు లేవు: