1, నవంబర్ 2023, బుధవారం

Central Govt Jobs: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 677 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ప‌రీక్ష విధానం, సిలబస్ ఇదే..!

కేంద్ర ప్రభుత్వ కొలువు కోరుకునే అభ్యర్థులకు చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో కీలకమైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)లో 677 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నిఘా విభాగంలో.. సెక్యూరిటీ అసిస్టెంట్‌/ మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్‌ స్టాప్‌(జనరల్‌) పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ఐబీ ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ తదితర వివరాలు..

  • ఐబీలో 677 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌
  • పదో తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు
  • రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక 
  • గ్రూప్‌-సి హోదాలో కొలువు

మొత్తం 677 పోస్ట్‌లు
తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌-362 పోస్టులు, ఎంటీఎస్‌ (జనరల్‌)-315 పోస్టులు ఉన్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌ కేంద్రంగా ఎస్‌ఏ/ఎంటీ ఏడు పోస్ట్‌లు, ఎంటీఎస్‌ (జనరల్‌) పది పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్రంగా.. ఎస్‌ఏ / ఎంటీ అయిదు పోస్ట్‌లు, ఎంటీఎస్‌ (జనరల్‌) 10 పోస్ట్‌లు ఉన్నాయి. అభ్యర్థులు తమ స్వరాష్ట్రానికి సంబంధించిన యూనిట్‌లోని పోస్ట్‌లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది.

అర్హతలు

  • ఇంటెలిజెన్స్‌ బ్యూరోలోని సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్,ఎంటీఎస్‌ (జనరల్‌) పోస్ట్‌లకు పదో తరగతి అర్హతతోనే పోటీ పడొచ్చు. 
  • సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ట్రాన్స్‌పోర్ట్‌ పో­స్టులకు మాత్రం తప్పనిసరిగా లైట్‌ మోటార్‌ వె­హికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగుండాలి. అదే విధంగా.. మోటార్‌ మెకానిజంపై అవగాహన ఉండాలి.

వయసు
గరిష్ట వయోపరిమితి సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోస్టులకు 27 ఏళ్లు, ఎంటీఎస్‌ జనరల్‌ పోస్టులకు 25 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

వేతనం
ఎంపికైన వారికి లెవల్‌-1, లెవల్‌-3లతో వేతన శ్రేణి నిర్ణయిస్తారు. సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోస్ట్‌లకు లెవల్‌-3తో రూ.21,700-రూ.69,100 వేతన శ్రేణి ఉంటుంది. ఎంటీఎస్‌(జనరల్‌) పోస్ట్‌లకు లెవల్‌-1లో రూ.18,000- రూ.56,900 వేతన శ్రేణి అందుతుంది.

ఎంపిక ప్రక్రియ
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలి దశలో రెండు పోస్టులకు కూడా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

తొలిదశ రాత పరీక్ష

  • ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌; ఎంటీఎస్‌(జనరల్‌) పోస్ట్‌ల అభ్యర్థులకు తొలి దశలో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌-40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌-20 ప్రశ్నలు, న్యూమరికల్‌/అనలిటికల్‌/లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌-20 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌-20 ప్రశ్నలు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్షకు లభించే సమయం ఒక గంట. పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు. 

రెండో దశ.. ఎస్‌ఏ/ఎంటీలకు క్షేత్ర పరీక్ష

  • తొలి దశ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ ఎంపిక ప్రక్రియను రెండురకాల పోస్ట్‌లకు వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తారు.
  • సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అభ్యర్థులకు మోటర్‌ మెకానిజం, డ్రైవింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. వాహన మరమ్మతులు చేసే పరీక్షలు, నిర్వహణ వంటి అంశాలను ప్రాక్టికల్‌గా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విభాగానికి 50 మార్కులు కేటాయించారు.
  • ఎంటీఎస్‌(జనరల్‌) అభ్యర్థులకు రెండో దశలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 50 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ప్యాసేజ్‌ రైటింగ్‌ ఉంటుంది. 

తుది జాబితా ఇలా

  • సెక్యూరిటీ అసిస్టెంట్‌/మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోస్ట్‌లకు రెండు దశల పరీక్షల్లో చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు.
  • ఎంటీఎస్‌(జనరల్‌) పోస్ట్‌లకు మాత్రం టైర్‌-1 రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తా­రు. వీరు టైర్‌-2లో నిర్వహించే ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • ఈ రెండు దశల్లోనూ చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరీల వారీగా కటాఫ్‌లను నిర్ణయించి తుది జాబితా రూపొందిస్తారు. అందులోనూ చోటు సాధించిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.

పదోన్నతులు ఇలా

  • సెక్యూరిటీ అసిస్టెంట్‌ తర్వాత స్థాయిలో జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (2), ఆ తర్వాత జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (1), అనంతరం అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, ఆ తర్వాత సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ హోదాలు ఉంటాయి.
  • ఎంటీఎస్‌ (జనరల్‌)గా నియమితులైన వారు విద్యార్హతలు పెంచుకుని.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ స్థాయి వరకు చేరుకోవచ్చు.

రాత పరీక్షలో విజయానికి ఇలా
జనరల్‌ అవేర్‌నెస్‌
అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే..భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకాన­మీ, పాలిటీ,రాజ్యాంగం,శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.

న్యూమరికల్‌/అనలిటికల్‌/లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌
ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌ సీరిస్, కోడింగ్‌-డీకోడింగ్, నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
ఈ విభాగంలో టాప్‌ స్కోర్‌ కోసం.. ప్యూర్‌ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
ఇంగ్లిష్‌ విభాగంలో రాణించడానికి బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్,సినానిమ్స్, మిస్‌-స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, వన్‌వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌
మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (జనరల్‌) పోస్ట్‌లకు రెండో దశలో నిర్వహించే ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వొకాబ్యులరీ పెంచుకునేలా కృషి చేయాలి. అదే విధంగా సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ కరెక్షన్‌లను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
ఇందుకోసం దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, అదే విధంగా ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి డిస్క్రిప్టివ్‌ ఆన్సర్స్‌ను ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్‌ 13, 2023.
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌ నగర్, వరంగల్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)