2, నవంబర్ 2023, గురువారం

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023 

సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.

పరీక్ష వివరాలు...

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023 

సబ్జెక్టు వివరాలు: పరీక్షను అయిదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. 

1. కెమికల్‌ సైన్సెస్ 

2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌

3. లైఫ్‌ సైన్సెస్

4. మ్యాథమేటికల్‌ సైన్సెస్

5. ఫిజికల్‌ సైన్సెస్‌

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌- ఎంఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌  ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్‌, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు పొందాలి. 

వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2023 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రిమిలేయర్‌)లకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.

పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. 

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1100, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.550, ఎస్సీ/ఎస్టీలకు రూ.275, థర్డ్ జెండర్ రూ.275, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 02.12.2023 నుంచి 04.12.2023 వరకు.

పరీక్ష తేదీలు: 26, 27 & 28-12-2023.

Important Links

Posted Date: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: