Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

31, అక్టోబర్ 2023, మంగళవారం

YSRHU: కౌన్సెలింగ్‌కు హాజరుకండి

YSRHU: కౌన్సెలింగ్‌కు హాజరుకండి  

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా  వెంకట్రామన్నగూడెంలోని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్‌) ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌ నవంబర్‌ 2, 3 తేదీల్లో వర్సిటీ పరిపాలన భవనంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ బి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఈఏపీ సెట్‌లో 1106 నుంచి 16,966 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు 2వ తేదీ ఉదయం 9.30 నుంచి, 17,003 నుంచి 28,992 ర్యాంకులు వచ్చిన వారు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. 29,002 నుంచి 45,909 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు 3వ తేదీ ఉదయం 9.30 నుంచి, 46,030 నుంచి 68,075 ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్వయంగా వర్సిటీలో జరిగే కౌన్సిలింగ్‌కు ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో హాజరుకావాలని రిజిస్ట్రార్‌ సూచించారు.

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...