తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ప్రాతిపదికన 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ, ఏఈ, ఏటీవోలు
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ప్రాతిపదికన 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూమతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10
- అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19
అర్హత: బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్‌సీఈ/ ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్).
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తులకు చివరి తేదీ: 23.11.2023.
ఆన్‌లైన్ దరఖాస్తు: https://ttd-recruitment.aptonline.in/ TTDRecruitment/Views/Dashboard.aspx
వెబ్‌సైట్: https://www.tirumala.org/
ఎన్టీఆర్ జిల్లాలో బ్లాక్ కోఆర్డినేటర్‌లు
విజయవాడలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఒప్పంద ప్రాతిపదికన ఎన్టీఆర్ జిల్లాలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- జిల్లా కోఆర్డినేటర్: 01
- జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01
- బ్లాక్ కోఆర్డినేటర్: 06
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం, ఎస్‌ఎన్‌ఆర్ అకాడమీ రోడ్డు, విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా’ చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2023.
వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/
వాక్-ఇన్స్
ఇర్కాన్‌లో డీజీఎం, జేపీఎంలు
న్యూదిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఇర్కాన్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 23 పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
- జేజీఎం/ ఎలక్ట్రికల్- 03
- డీజీఎం/ ఎలక్ట్రికల్- 06
- మేనేజర్/ ఎలక్ట్రికల్- 02
- మేనేజర్/ ఓహెచ్‌ఈ- 04
- మేనేజర్/ ఎస్ అండ్ టీ- 02
- డబ్ల్యూఈ/ ఎలక్ట్రికల్- 04
- సైట్ సూపర్‌వైజర్/ ఎలక్ట్రికల్- 02
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీతోపాటు పని అనుభవం.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 06, 07, 08, 20, 21, 22-11-2023.
వేదిక: ఇర్కాన్ కార్పొరేట్ ఆఫీస్- న్యూదిల్లీ, ఇర్కాన్ ప్రాజెక్ట్ ఆఫీస్- అలీపుర్దువార్ (పశ్చిమ్ బెంగాల్), ఇర్కాన్ ప్రాజెక్ట్ ఆఫీస్- దిబ్రూగర్ (అసోం)
వెబ్‌సైట్: https://ircon.org/
ప్రవేశాలు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో..
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2023-24 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ అనుబంధ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
I. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు (బీపీటీ)
II. బీఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)
III. బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సులు
1. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ 2. బీఎస్సీ ఆపరేషన్ థియేటర్
టెక్నాలజీ 3. బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ 4.
బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ 5. బీఎస్సీ ఆప్టోమెట్రీ 6. బీఎస్సీ
రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ 7. బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ 8.
బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ 9. బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్
టెక్నాలజీ 10. బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ 11. బీఎస్సీ
మెడికల్ రికార్డ్స్ సైన్సెస్ 12. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ 13.
బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ
కోర్సు వ్యవధి: బీఎస్సీ కోర్సుకు నాలుగేళ్లు, ఏడాది ఇంటర్న్‌షిప్. బీపీటీకి నాలుగేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్.
అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్
ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/ సార్వత్రిక విద్యలో ఇంటర్ (ఫిజికల్
సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్).
వయసు: డిసెంబర్ 31, 2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000.
ఎంపిక: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 27-10-2023 నుంచి 02-11-2023 వరకు.
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి