2, ఫిబ్రవరి 2021, మంగళవారం

తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 30,000 వరకూ జీతం

తిరుపతిలో రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :

శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి లో వుమన్ బయోటెక్ ఇంక్యూబేషన్ ఫెసిలిటీ లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 8,2021

విభాగాల వారీగా ఖాళీలు :

రీసెర్చ్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బయో టెక్నాలజీ /ఫార్మా స్యూటికల్ సైన్సెస్ /లైఫ్ సైన్స్ విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ ( PG ) లో ఉత్తిర్ణులు అయి ఉండవలెను.

లైఫ్ సైన్సెస్ కు సంబంధించి టెక్నికల్ వర్క్, పరిశోధనల్లో 2 సంవత్సరాలు అనుభవం మరియు ఆంగ్ల భాష పరిజ్ఞానం మరియు రైటింగ్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

పరీక్ష లేదా ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

spmvvwbif@gmail.com

Website

Notification

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు లేవు: