ఫిబ్రవరి 13 నుండి 21వ తేదీ వరకు
దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
       వైఎస్‌ఆర్ కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
 ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
కోవిడ్ - 19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ                            ఉదయం                         రాత్రి
13-02-2021(శనివారం)         ధ్వజారోహణం           చంద్రప్రభ వాహనం
14-02-2021(ఆదివారం)        సూర్యప్రభవాహనం      పెద్దశేష వాహనం
15-02-2021(సోమవారం)       చిన్నశేష వాహనం        సింహ వాహనం
16-02-2021(మంగళవారం)    కల్పవృక్ష వాహనం       హనుమంత వాహనం
17-02-2021(బుధవారం)      ముత్యపుపందిరి వాహనం    గరుడ వాహనం
18-02-2021(గురువారం)          కల్యాణోత్సవం                   గజవాహనం        
19-02-2021(శుక్రవారం)            రథోత్సవం                        ధూళి ఉత్సవం
20-02-2021(శనివారం)       సర్వభూపాల వాహనం            అశ్వ వాహనం
21-02-2021(ఆదివారం)             చక్రస్నానం     హంసవాహనం, ధ్వజావరోహణం
         కాగా, ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది.
ఫిబ్రవరి 9న  కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
      శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
      ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
కామెంట్‌లు