యూ ట్యూబ్.. ఇంటర్ నెట్ వినియోగించే వారిలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిషయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికిపైగా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఏటా రూ.100 కోట్లకు పైగా డబ్బు సంపాదించేవారూ ఉన్నారు. అయితే చాలా మందికి యూట్యూబ్ ద్వారా ఎలా డబ్బు సంపాదించాలో తెలియదు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ముందుగా మీరు యూట్యూబ్లో ఛానెల్ ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా గూగుల్‌లో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మీ జీమెయిల్ అకౌంట్ ఐడీయే గూగుల్ ఐడీ కూడా. అదే యూట్యూబ్ ఐడీ కూడా అవుతోంది. ఆ ఐడీ పేరే మీ యూట్యూబ్ ఛానెల్ పేరు. మొదట అదే పేరుతో మీరు యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో పేరు మార్చుకోవచ్చు.
యూట్యూబ్‌లో సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం స్క్రీన్ కుడి చేతి పై భాగంలో అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వీడియోను అప్ లోడ్ చేయాలి. తర్వాత మీ వీడియోకు టైటిల్ ఇవ్వాలి. పూర్తిగా అప్‌లోడ్ అయిన తర్వాత పబ్లిష్ (Publish) ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎన్ని వీడియోలైనా ఇలాగే అప్‌లోడ్ చేయొచ్చు. ఆ వీడియోలు మీరు స్వయంగా తీసినది, మీ సొంత వీడియో అయి ఉండాలి. వేరే వాళ్ల వీడియోలను అప్ లోడ్ చేయ వద్దు. మీరు పబ్లిష్ చేసిన వీడియోలు మీ యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియో మేనేజర్ ఫోల్డర్‌లో కనిపిస్తాయి. (www.youtube.com/my_videos). ఆ వీడియోలకు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటనలను జతచేస్తుంది. ఆ యూడ్స్‌పై వచ్చే ఆదాయంలో 60 శాతం మీకు ఇస్తుంది. ఇలా జరగాలంటే రెండు కండీషన్లు ఉంటాయి.
మొదటిది సంవత్సరంలో ఏడాదిలో మీకు సొంతంగా 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. రెండవది మీ వీడియోల మొత్తం వ్యూస్ 4లక్షల నిమిషాలు ఏడాదిలో పూర్తవ్వాలి. మీరు టార్గెట్ చేరుకున్నదీ లేని విషయాన్ని తెలుసుకోవడానికి అనలిటిక్స్ ఫోల్డర్ (https://www.youtube.com/analytics)లో చూసుకోవచ్చు. టార్గెట్ చేరుకున్నాక, మీరు యాడ్స్ ప్లే అయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ యాడ్ సెన్స్ (www.google.com/adsense) అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఓ ఐడీ నెంబర్‌ను యాడ్ సెన్స్ ఇస్తుంది. ఆ ఐడీని కాపీ చేసి యూట్యూబ్ అకౌంట్‌లోని మోనెటైజేషన్ ఆప్షన్ (www.youtube.com/ account_monetization)లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఓ వారంలో యూట్యూబ్ నుంచీ మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచీ మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి. తద్వారా మీకు ఆదాయం రావడం ప్రారంభమవుతుంది.
మీ ఆదాయం తెలియాలంటే మీరు మీ యాడ్ సెన్స్ అకౌంట్ లోకి (www.google.com/adsense)వెళ్లి చూసుకోవచ్చు. యాడ్ సెన్స్ అకౌంట్‌లో మీ సంపాదన 90 డాలర్లు (రూ.6 వేలకు పైగా) దాటగానే గూగుల్ అకౌంట్‌లో మీరు ఇచ్చిన మీ సొంత అడ్రెస్‌కి గూగుల్ నుంచి ఆరు అంకెల కోడ్ ఒకటి పోస్ట్ రూపంలో వస్తుంది. ఆ కోడ్‌లో ఉన్న ఆరు అంకెల కోడ్‌ని మీరు యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఎంటర్ చేయాలి.
అనంతరం వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, నెంబర్, IFSC వంటి వివరాలను యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీ సంపాదన 100 డాలర్లు (రూ.7 వేలకు పైగా) అవ్వగానే... సింగపూర్‌లోని గూగుల్ బ్రాంచ్ నుంచీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఆ డబ్బును (100 డాలర్లను) గూగుల్ పంపిస్తోంది. ఆ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి ఓ వారం పడుతుంది. ఇలా ప్రతిసారీ 100 డాలర్లు అవ్వగానే ఆటోమేటిక్‌గా డబ్బులు ఖాతాలోకి జమ అవుతాయి. మీరు యూట్యూబ్ రూల్స్ పాటించకపోతే మీ ఖాతా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి