- ఆన్లైన్ లో బుకింగ్ కు టీటీడీ నిర్ణయం
తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు
ఆన్లైన్ ద్వారా సామూహిక వివాహాలతో పాటు చెవిపోగులు కుట్టించుకోవడానికి కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ 19 నేపథ్యంలో తిరుమల కళ్యాణ వేదికలో సామూహిక వివాహాలకు టీటీడీ అనుమతులు నిలివేసింది.
ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం, భక్తుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో కళ్యాణ వేదిక కార్యక్రమాలు పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి