బెంగళూరులోని
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్
లిమిటెడ్(బెల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు:సెక్యూరిటీ ఆఫీసర్/అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-01, జూనియర్ సూపర్‌వైజర్ (సెక్యూరిటీ)-01, హవిల్దార్(సెక్యూరిటీ)-20.
- సెక్యూరిటీ ఆఫీసర్/అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్:
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో కెప్టెన్ ర్యాంకు హోదాలో పనిచేసి ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి సెక్యూరిటీ ఆఫీసర్-32ఏళ్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-40ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థలను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 85 మార్కులకు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది 15 మార్కులకు ఉంటుంది.
- జూనియర్ సూపర్‌వైజర్(సెక్యూరిటీ):
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులవ్వాలి. ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో జేసీఓ ర్యాంక్ హోదాలో 15ఏళ్లు పనిచేసి ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 43 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
- హవిల్దార్ (సెక్యూరిటీ):
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులవ్వాలి. ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో 15ఏళ్లు పనిచేసి ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 43ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: జూనియర్ సూపర్‌వైజర్, హవిల్దార్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులను ఫిజికల్ ఎండ్యూరెన్స్/స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్/స్కిల్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష బెంగళూరులో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 10, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.bel-india.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి