31, జనవరి 2021, ఆదివారం

TTD NEWS

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో విశేష ఉత్స‌వాలు  

        తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు  జ‌రుగనున్నాయి. కోవిడ్ - 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాలన్నీ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

-   ఫిబ్రవరి 01 న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీగోవిందరాజస్వామివారికి  తిరుమంజనము మరియు ఆస్థానం నిర్వహిస్తారు.

- ఫిబ్రవరి 2న‌ శ్రీ కూరత్తాళ్వారు వర్ష తిరు నక్షత్రం మరియు అధ్యయనోత్సవాలలో పెద్ద శాత్తుమొర

- ఫిబ్ర‌వ‌రి 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

- ఫిబ్రవరి 05న‌ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

-  ఫిబ్రవరి 7, 23వ తేదీల‌లో ఏకాదశి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ప్రత్యేక తిరుమంజనము నిర్వహిస్తారు.

-  ఫిబ్రవరి 11న‌ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

- ఫిబ్రవరి 19న రథసప్తమి.
 
- ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ వరకు తెప్పోత్సవాలు.

-  ఫిబ్రవరి 20న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

-   ఫిబ్రవరి 27 పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి వారికి పూలంగి సేవ నిర్వహిస్తారు.

కామెంట్‌లు లేవు: