1, ఫిబ్రవరి 2021, సోమవారం

Tirupati Jobs Recruitment 2021 Update || పరీక్ష లేదు, తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి ఐజర్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో  ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ నియామకానికి గాను ఒక ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాల  అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 5,2021
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 10,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రాజెక్ట్ అసిస్టెంట్

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్స్ గా బీ. ఎస్సీ ను పూర్తి చేయవలెను. కెమిస్ట్రీ సబ్జెక్టు లో 60% మార్కులు తప్పనిసరి అని ప్రకటనలో పొందుపరిచారు.

ఆర్గానిక్ కెమిస్ట్రీ /జనరల్ కెమిస్ట్రీ /ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలలో ఎం. ఎస్సీ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని నోటిఫికేషన్ లో తెలిపారు.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వర్ట్యూయల్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ ఫెలో షిప్ లభించనుంది.

ఈమెయిల్ అడ్రస్ :

kiran@iisertirupati.ac.in

Website

Notification

Apply Now : kiran@iisertirupati.ac.in

కామెంట్‌లు లేవు: