2, ఫిబ్రవరి 2021, మంగళవారం

TTD NEWS



🕉 *తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం*
        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌ : తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో త్వ‌ర‌లో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

■ సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. 
👉ఈ టికెట్ ధ‌ర‌ను రూ.500/-గా నిర్ణ‌యించారు. గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు. 
◆ ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు.

కామెంట్‌లు లేవు: