2, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఆర్‌బీఐలో ఆఫీసర్ కొలువులు.. మొత్తం 322 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర బ్యాంకు..


దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ బీ పోస్టుల భర్తీకి భారత కేంద్ర బ్యాంకు.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆర్‌బీఐలో పనిచేయాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది చక్కటి అవకాశం. మూడు దశల్లో నిర్వహించే ఎంపిక విధానం ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్‌బీఐ..

దేశ కేంద్ర బ్యాంకు.. భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ). దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులపై నియంత్రణ కలిగి ఉంటుంది. దేశ ఆర్థిక ఒడిదుడుకులను చక్కదిద్దుతూ.. దేశాన్ని ఆర్థికంగా ప్రగతి పథంలో నడపించేందుకు కృషి చేస్తుంది ఆర్‌బీఐ. ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలకు అనుగుణంగా ద్రవ్య విధానాలకు రూపకల్పన చేస్తుంది. దేశ బ్యాంకింగ్ రంగాన్ని అదుపుతప్పకుండా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలతో ఆర్‌బీఐ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వివిధ అవసరాలు, ఖాళీలకు అనుగుణంగా ప్రతి ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆ క్రమంలోనే 2021 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 322 గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. సుస్థిరమైన జీవితం, ఆకర్షణీయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత.. సహా ఇతర ప్రయోజనాలు ఈ ఉద్యోగాలతో సొంతం చేసుకోవచ్చు.


మొత్తం పోస్టుల సంఖ్య: 322
గ్రేడ్-బి ఆఫీసర్స్(డీఆర్)-జనరల్ -270
గ్రేడ్-బి ఆఫీసర్స్(డీఆర్) -డీఈపీఆర్ -29
గ్రేడ్-బి ఆఫీసర్స్ (డీఆర్)- డీఎస్‌ఐఎం -23

అర్హతలు..

  1. గ్రేడ్-బి జనరల్: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 60శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసినవారై ఉండాలి.
  2. డీఈపీఈఆర్: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఎకనామిక్స్/ఎకనామెట్రిక్/క్వాంటిటేటివ్‌ఎకనామిక్స్/మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్/ఫైనాన్స్/అగ్రికల్చర్/బిజినెస్/డవలప్‌మెంట్/అప్లైడ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా పీజీడీఏ/ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తి చేయాలి.
  3. డీఎస్‌ఐఎం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ఎకనామెట్రిక్/స్టాటిస్టిక్స్-ఇన్ఫర్మేటిక్) లేదా పీజీ డిప్లొమా(స్టాటిస్టిక్స్/బిజినెస్ అనాలిటిక్స్) చేసినవారై ఉండాలి


వయసు..

  1. పై మూడు పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21-30 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. జనవరి 02,1991 నుంచి జనవరి 01, 2000 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎంఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32ఏళ్లు, 34ఏళ్లుగా ఉంది. అలాగే ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా రిజర్వ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
  2. అలాగే ఆయా పోస్టులకు గతంలో ఆరుసార్లు ప్రయత్నించిన అభ్యర్థులు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఎస్సీ/ఎస్సీ/ఓబీసీ/దివ్యాంగులైన అభ్యర్థులకు ఈ నిబంధనల నుంచి మినహయింపు ఉంది.

పోస్టులను బట్టి ఎంపిక ప్రక్రియ వేర్వురుగా ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి.. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  1. రాత పరీక్షకు సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఫేజ్-1 పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో 200 మార్కులకు ఉంటుంది. రెండు గంటల పాటు పరీక్షకు సమయాన్ని కేటాయిస్తారు.


ఫేజ్-1: ప్రిలిమ్స్

సెక్షన్

ప్రశ్నలు

మార్కులు

జనరల్ అవేర్‌నెస్8080
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్3030
ఇంగ్లిష్ లాంగ్వేజ్3030
రీజనింగ్6060
మొత్తం200200


ఫేజ్-2: మెయిన్..
ఫేజ్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఫేజ్-2 పరీక్ష రాసే అర్హత ఉంటుంది. ఫేజ్-2లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఫేజ్-2లో ప్రతిభ చూపిన వారిని మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేసి..ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 75 మార్కులకు ఉంటుంది.

సెక్షన్

పేపర్ పద్ధతి

మార్కులు

పరీక్షా సమయం

ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ఆబ్జెక్టివ్10090 ని.
ఇంగ్లిష్ (రైటింగ్ స్కిల్స్)డిస్క్రిప్టివ్10090 ని.
ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ఆబ్జెక్టివ్10090 ని.


పరీక్షా కేంద్రాలు
..
  1. ఈ మూడు పోస్టుల పరీక్షకు సంబంధించి ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు తెలంగాణలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ నగరాల్లో నిర్వహిస్తారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రిలో నిర్వహిస్తారు.
  2. ఫేజ్-2 పరీక్ష మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లోనే ఉంటుంది.

దరఖాస్తు ఇలా..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు..

  1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2021
  3. ఫేజ్-1 (డీఆర్- జనరల్/డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం): మార్చి 06, 2021
  4. ఫేజ్-2 (గ్రూప్-బి డీఆర్) డీఈపీఆర్/ డీఎస్‌ఐఎం): మార్చి 31, 2021
  5. ఫేజ్-2 (గ్రూప్-బి డీఆర్) జనరల్: ఏప్రిల్ 01, 2021
  6. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.rbi.org.in

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

కామెంట్‌లు లేవు: