మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎస్ఎస్సి ఎంటిఎస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ రిక్రూట్‌మెంట్ ఫారమ్‌కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆహ్వానించబడింది. ఆ అభ్యర్థులు ఈ క్రింది ఎస్‌ఎస్‌సి ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ఖాళీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Some Useful Important Links |
|
Apply Online (Registration) |
|
Login for Already Registered |
|
Download Notice |
|
Official Website |
రేపే భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు.. వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు
స్టాప్ సెలక్షన్ కమిషన్
ప్రధానాంశాలు:
రేపే ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ 2021 నోటిఫికేషన్ విడుదల
పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు
రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలను స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) భర్తీచేస్తుంది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నాన్‌టెక్నికల్ పోస్టుల భర్తీకి ఈనెల 5న విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 29న నోటిఫికేషన్ వెలువడాలి.. కానీ.. వివిధ కారాణాల వల్ల వాయిదావేశారు. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం విడుదల కానుంది.
ఇప్పటికే ఈ అంశంపై ఎస్ఎస్‌సీ ప్రకటించింది. కాగా.. ఎన్ని పోస్టులను భర్తీ చేయనుందనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది 7099 పోస్టులను భర్తీ చేసింది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో పోస్టులను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
వయసు: అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కోమార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. గంటన్నర లోపు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 మార్కులు కోతవిధిస్తారు. పేపర్-2లో 50 మార్కులకు షార్ట్ ఎస్ఏ లేదా లెటర్ రైటింగ్‌పై ప్రశ్నలు అడుగుతారు. దీనిని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 5 తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 18, 2021
ఆన్‌లైన్ పరీక్షలు: జూలై 1 నుంచి జూలై 20 వరకు
వెబ్‌సైట్:https://ssc.nic.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి