2, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఆర్‌బీఐలో 241 సెక్యూరిటీ గార్డ్‌ కొలువులు.. అర్హత వివ‌రాలివే..


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది.
Current Affairs

ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • మొత్తం పోస్టుల సంఖ్య : 241
  • పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డ్‌(హైదరాబాద్‌–03, అహ్మదాబాద్‌–07, బెంగళూర్‌–12, భోపాల్‌–10, భువనేశ్వర్‌–08, చండీగఢ్‌–02, చెన్నై–22, గౌహతి–11, జైపూర్‌–10, జమ్మూ–04, కాన్పూర్‌–05, కోల్‌కతా–15, లక్నో–05, ముంబై–84, నాగ్‌పూర్‌–12, న్యూఢిల్లీ–17, పాట్నా–11, తిరువనంతపురం–03).
  • నియామకాల్లో భాగంగా అభ్యర్థుల తుది ఎంపిక సమయం వరకు పోస్టుల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించే అధికారం ఆర్‌బీఐకి ఉంది.

అర్హతలు..

  • పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతలను కలిగి ఉండాలి. రక్షణ దళాల్లో ఎక్స్‌సర్వీస్‌మెన్‌ సేవలను అందించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు.
  • వయసు: 01.01.2021 నాటికి 25–28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్, ప్రీ–రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Career guidance

ఆన్‌లైన్‌ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఫిజికల్‌ టెస్టులను నిర్వహిస్తారు. ఈ రెండు విభాగాల్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ సహా ప్రీ–రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ల్లో అర్హత సాధించిన వారిని బ్యాంకు నిబంధనల ప్రకారం–తుది ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

పరీక్షా విధానం..
ఆన్‌లైన్‌ విధానంలో టెస్ట్‌ ఉంటుంది. ఈ పరీక్ష మూడు విభాగాల్లో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. రీజనింగ్‌ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌లో 30 ప్రశ్నలు–30 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీపై 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 80 నిమిషాలు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. సెక్షనల్‌ కటాఫ్‌ కూడా ఉండదు.

విధులు..

  • బ్యాంకు ఆస్తులకు కాపలా ఉండటం లేదా జిరాక్స్‌ యంత్రాల వద్ద పనిచేయడం, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌(డీఎఫ్‌ఎమ్‌డీ) ఎంట్రీ గేట్‌ దగ్గర తనిఖీ చేయడం లేదా బ్యాంకు నిర్ణయం ప్రకారం ఏ పని అయినా చేయడానికి సిద్దంగా ఉండాలి.
  • సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు.. నైట్‌ షిప్టులతో సహా రొటేషన్‌ ప్రకారం అన్ని షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుంది.

వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ.27,678 వరకు పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం..

  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ : 12.02.2021
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ : https://www.rbi.org.in

కామెంట్‌లు లేవు: