భారత కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖకు చెందిన ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | మార్చి 26, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీ స్కిల్ – గ్రూప్ సీ )
లేబర్యాటరీ టెక్నీషియన్ ( కెమిస్ట్రీ – గ్రూప్ సీ )
అర్హతలు :
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించవలెను. మరియు అడ్మినిస్ట్రేషన్ / అకాడమిక్స్ /పర్చేస్ & స్టోర్స్ / అకౌంట్స్ /ఐటీ /ఇంజనీరింగ్ విభాగాలలో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. మాస్టర్ డిగ్రీ తో పాటు సంబంధిత విభాగాలలో నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు కంప్యూటర్ స్కిల్స్, డ్రాఫ్టింగ్ మరియు నోటింగ్ స్కిల్స్ ఉండాలి అని ప్రకటనలో పొందు పరిచారు.
లేబర్యాటరీ టెక్నీషియన్ పోస్టుకు కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టు గా డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను. మరియు రసాయనిక ప్రయోగాల్లో అవగాహన మరియు అనుభవం తప్పనిసరి అని తెలిపారు.
అభ్యర్థులు మరింత ముఖ్య సమాచారం కొరకు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 39 సంవత్సరాలు మరియు లేబర్యాటరీ టెక్నీషియన్స్ ఉద్యోగాలకు 27 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10-15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజు ను మరియు దివ్యాంగులు, ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులు 375 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ల విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
అవసరాన్ని బట్టి ఆన్లైన్ పరీక్ష / స్కిల్ టెస్ట్ లను నిర్వహించనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం గా 55,000 రూపాయలు నుండి 78,000 రూపాయలు వరకూ జీతంగా అందనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి