10, మార్చి 2021, బుధవారం

హైదరాబాద్ NMDC లో 304 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి 11, 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిమార్చి 31, 2021
ఆఫ్ లైన్ దరఖాస్తులు చేరేందుకు చివరి తేదిఏప్రిల్ 15, 2021, ముందు వరకూ.

విభాగాల వారీగా ఖాళీలు :

ఫీల్డ్ అసిస్టెంట్స్ (ట్రైనీస్)65
మెయింటనెన్స్ అసిస్టెంట్(మెకానిక్) ట్రైనీ148
మెయింటనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్) ట్రైనీ81
బ్లాస్టర్ గ్రేడ్ II ట్రైనీ1
MCO గ్రేడ్ III ట్రైనీ9

మొత్తం ఖాళీలు :

మొత్తం 304 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

మిడిల్ పాస్ (హై స్కూల్ లెవెల్ ) / ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెల్డింగ్ /ఫిట్టర్ /మెషినిస్ట్ /మోటార్ మెకానిక్ /డీజిల్ /మెకానిక్ /ఆటో ఎలక్ట్రీషియన్ విభాగాలలో ఐటీఐ కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయింటనెన్స్ అసిస్టెంట్స్ (మెకానిక్ ) ట్రైనీ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగాలలో ఐటీఐ కోర్సును పూర్తి చేసినవారు మెయింటనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్ )ట్రైనీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మెట్రిక్ /ఐటీఐ విత్ బ్లాస్టర్ /మైనింగ్ మేట్ సర్టిఫికెట్ / ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ మరియు బ్లాస్టింగ్ ఆపరేషన్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు బ్లాస్టర్ గ్రేడ్ -II (ట్రైనీ ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో  మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులు చేసి , హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు MCO గ్రేడ్ – III (ట్రైనీ ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 150 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష , ఫీజికల్ ఎబిలిటీ టెస్ట్ , ట్రేడ్ టెస్ట్ ల నిర్వహణ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 18,000 రూపాయలు నుండి 35,040 రూపాయలు వరకూ జీతములు లభించనుంది.

ఆఫ్ లైన్ దరఖాస్తులను పంపించవలసిన చిరునామా :

Post Box number : 1383, Post office,Humayun Nagar, Hyderabad,Telanga State, Pin Code : 500028.

Website 

Notification

Last Date : మార్చి 31, 2021

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: