11, మార్చి 2021, గురువారం

ఎన్‌ఎండీసీలో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ మార్చి 23

భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ), హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ).. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Jobs 
వివరాలు:
పోస్టుల వివరాలు
  • జూనియర్‌ ఆఫీసర్‌ (మైనింగ్‌) ట్రైనీ–28 విద్యార్హతలు: మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్‌ మోటాలిఫెరస్‌ మైన్‌కు సంబంధించిన ఫోర్‌మెన్స్‌ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. లేదా మైనింగ్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్‌ మోటాలిఫెరస్‌ మైన్‌కు సంబంధించిన మైన్స్‌ మేనేజర్‌ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

  • జూనియర్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌ ) ట్రైనీ –17
    విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

  • జూనియర్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌)ట్రైనీ –13
    విద్యార్హతలు:
    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజరీ సర్టిఫికేట్‌ (మైనింగ్‌)/ ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

  • జూనియర్‌ ఆఫీసర్‌ (సివిల్‌) ట్రైనీ–05
    విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల/సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 32 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు–05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరు గుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ : మార్చి 23, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.nmdc.co.in
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS   

కామెంట్‌లు లేవు: