అతి తక్కువ విద్యా అర్హతలుతో, మెరిట్ ఆధారంగా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల స్థానిక జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతులు ( దివ్యాంగులు ) అందరూ దరఖాస్తు చేసుకోవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | మార్చి 2, 2021 |
దరఖాస్తుకు చివరి తేది | ప్రకటన వచ్చిన 15రోజుల లోపు |
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రూప్ – 4 ఉద్యోగాలు :
జూనియర్ అసిస్టెంట్స్ | 13 |
టైపిస్ట్ | 2 |
షరాఫ్ | 1 |
గ్రూప్ -4 కానీ టెక్నికల్ ఉద్యోగ ఖాళీలు :
హెల్త్ అసిస్టెంట్స్ | 2 |
మెటర్నటి అసిస్టెంట్ | 1 |
ల్యాబ్ అటెండెంట్ | 1 |
వెటర్నరీ అటెండెంట్ | 1 |
ఫిట్టర్ బెడ్ ఆపరేటర్ | 1 |
క్లాస్ – 4 ఉద్యోగాలు :
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ | 12 |
సానిటరీ మేస్త్రి | 2 |
మెసెంజర్ | 1 |
వాచ్ మెన్ | 1 |
గార్డనర్ | 1 |
కామటి | 2 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 41 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ గ్రూప్ 4 మరియు నాన్ గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి పోస్టులకు 5, 7 మరియు 10వ తరగతి మరియు ఇంటర్, సంబంధిత విభాగాలలో ఐటీఐ /డిప్లొమా /డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం, తెలుగు భాషలో పరిజ్ఞానం అవసరం. మరియు తెలుగు, హిందీ వ్రాయడం, చదవడం వచ్చి ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 52 సంవత్సరాలు వయసు కలిగిన విభిన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ను ఈ క్రింది చిరునామా కు ప్రకటన విడుదలైన 15 రోజుల లోపు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
విభాగాలను అనుసరించి పోస్టులను బట్టి ఎంపిక విధానం ఉంటుంది. మెరిట్ ను అనుసరించి కొన్ని పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.మరి కొన్ని విభాగాల పోస్టులను మెరిట్ మరియు కంప్యూటర్ బేస్డ్ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా 20,000 రూపాయలు నుండి ప్రారంభ జీతముగా లభించునుంది.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ,
కలెక్టర్ కార్యాలయం ఆవరణ, మచిలీపట్నం,
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
website
Notification
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి