8, మార్చి 2021, సోమవారం

KIML, హిందూపురం లో ఉద్యోగాలకు APSSDC ద్వారా ఇంటర్వ్యూ ల నిర్వహణ

పరీక్ష లేదు, క్యూంగ్ షిన్ ఇండస్ట్రీస్ లో 280 ఉద్యోగాలు, అసలు మిస్ కావద్దు

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమార్చి 11, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

అసోసియేట్స్ స్పెషల్ ట్రైనీస్200
డిప్లొమా (ఆపరేటర్స్ & ఇంజనీర్స్ )50
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ( ఆపరేటర్స్ & ఇంజనీర్స్ )30

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 280 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్ ఉద్యోగాలకు 10వ తరగతి /ఇంటర్/డిగ్రీ పాస్ మరియు ఫెయిల్ అయిన మహిళా అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

మెకానికల్ /ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ విభాగాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ డిప్లొమా (ఆపరేటర్స్ & ఇంజనీర్స్ ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

EEE/ECE/మెకానికల్ విభాగాలలో బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ గ్రాడ్యుయేషన్ ఇంజనీర్స్ (ఆపరేటర్ & ఇంజనీర్స్ ) పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

పైన తెలిపిన విభాగాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుండి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండవలెను.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

టెక్నికల్ & హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

అసోసియేట్ ఉద్యోగాలకు 8,800 రూపాయలు,  డిప్లొమా ఉద్యోగాలకు 10,500 రూపాయలు మరియు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులకు 11,500 రూపాయలు జీతముగా లభించనున్నది.

ఈ జీతం తో పాటు ESIC + EPFO  మరియు ఉచిత ట్రాన్స్ పోర్ట్ + ఉచిత భోజన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

క్యూంగ్ షిన్ ఇండస్ట్రియల్ మదర్ సన్ ప్రైవేట్ లిమిటెడ్, హిందూ పూర్, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

79812 22035

93982 14443

1800-425-2422

Registrations Link

Website 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

కామెంట్‌లు లేవు: