No Exam DRDO Recruitment 2020 Telugu || DRDO సంస్థ, వైజాగ్ NSTL లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లకు నోటిఫికేషన్
DRDO సంస్థ, వైజాగ్ NSTL లో జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్ లకు నోటిఫికేషన్ విడుదల :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) ఆధ్వర్యంలో ఉన్న నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరటరీ (NRTL),విశాఖపట్నం లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 16,2020 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 15,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ) | 4 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో ( ఈఈఈ ) | 3 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో (కంప్యూటర్ సైన్స్) | 3 |
మొత్తం ఖాళీలు :
మొత్తం 10 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో డిగ్రీ /బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం.టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. నెట్ మరియు గేట్ పరీక్షల్లో స్కోర్ కార్డు అవసరం.
వయసు :
28 సంవత్సరాలు లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ ఓసి కేటగిరి అభ్యర్థులు 10 రూపాయలు దరఖాస్తు ఫీజు గా చెల్లించవలెను. ఓబీసీ /ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారీగా 31,000 రూపాయలు స్టై ఫండ్ ను అందుకోనున్నారు. ఈ స్టై ఫండ్ తో పాటు అభ్యర్థులకు HRA కూడా లభించనున్నది.
ఈమెయిల్ అడ్రస్ :
admin.dept@nstl.drdo.in
చిరునామా :
Naval Science and Technology Laboratery,
Vigyan Nagar,
Visakhapatnam-530027,
Andhrapradesh.
ఫోన్ నంబర్లు :
0891-2586013/2586403.
Fax No : 0891- 2559464
కామెంట్‌లు