18, డిసెంబర్ 2020, శుక్రవారం

*సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీలో స్వల్ప మార్పు*


        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌: 
తిరుపతిలోని 
◆ అలిపిరి భూదేవి కాంప్లెక్స్,
◆ విష్ణునివాసంలో గల కౌంటర్లలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను మూసివేయడం జరుగుతుంది.
◆ డిసెంబర్ 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను  కూడా డిసెంబర్ 21వ తేదీ లోపు జారీ చేస్తారు. 
 భక్తులు ఈ మార్పును గమనించి టిటిడికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

■ కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మ‌రియు గ‌తంలో జ‌రిగిన శాంతిభ‌ద్ర‌త‌లు, ఇత‌ర అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప‌ర్యాయం వైకుంఠ ఏకాద‌శి స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు స్థానికుల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌డ‌మైన‌ది. ద‌య‌చేసి స్థానికేత‌రులెవ్వ‌రూ టోకెన్ల కొర‌కు రావద్దని మనవి చేయడమైనది. స్థానికులు కూడా ఆధార్ కార్డు తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన 5 ప్రాంతాలకు వచ్చి టోకెన్లు పొందాలని కోరడమైనది.
 *Dept.Of PRO TTD.* 

కామెంట్‌లు లేవు: