17, డిసెంబర్ 2020, గురువారం

*డిసెంబ‌రు 22న టిటిడిలో వ‌స్త్రాల టెండర్‌ కమ్‌ వేలం*


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:   తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను డిసెంబ‌రు 22వ‌ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 272 లాట్లు ఉన్నాయి. ఇందులో పాలిస్ట‌ర్, కాట‌న్‌ పంచ‌లు, క్లాత్ బిట్స్‌, హుండీ గ‌ల్లేబులు, ప‌విత్రాలు, బ్లౌజ్‌పీస్‌లు,   ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, శాలువ‌లు, బెడ్‌షీట్లు, దిండుక‌వ‌ర్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళం కార్పెట్లు, దుప్ప‌ట్లు, క‌ర్ట‌న్లు, గ‌ర్భ‌గృహ కురాళాలు, బంగారువాకిలి ప‌ర‌దాలు, కాకి ప‌ర‌దాలు ఉన్నాయి.

👉 ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి

🕉 *వెబ్‌సైట్‌ www.tirumala.org
 సంప్రదించగలరు.*
🕉 *డిసెంబ‌రు 23న‌ కంపోస్ట్‌ ఎరువుల అమ్మ‌కానికి ఈ – వేలం*

🟢 తరుమ‌ల‌లోని కాకుల‌కొండ ప్రాంతంలోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హణ ‌(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి త‌యారు చేసిన ఆరు వేల ట‌న్నుల ఎరువును డిసెంబ‌రు 23న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.

👉 ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో  లేదా తిరుమ‌ల‌లోని ఇఇ – 8 కార్యాలయాన్ని 0877-2263525 నంబ‌ర్ల‌లో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్
www.konugolu.ap.gov.in, ఈ-మెయిల్
gmauctionsttd@gmail.com ను గానీ సంప్రదించగలరు.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: