15, డిసెంబర్ 2020, మంగళవారం

ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

భారతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కోస్టల్ గార్డ్ లో అసిస్టెంట్ కమాండంట్ విభాగంలో ఖాళీగా ఉన్న జనరల్ డ్యూటీ బ్రాంచ్ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల 

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 21,2020
దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 27,2020
వ్రాత పరీక్ష నిర్వహణ తేదీజనవరి /ఫిబ్రవరి,2021

విభాగాల వారీగా ఖాళీలు :

అసిస్టెంట్ కమాండంట్ విభాగం  :

ఎస్సీ5
ఎస్టీ14
ఓబీసీ6

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ విద్యను మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1,1996 నుండి జూన్ 30,2000 మధ్యగల సంవత్సరాలలో జన్మించిన వారై ఉండవలెను.(ఇవ్వబడిన తేదీలు కలిపి ).ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ మార్కులు, వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 56,100 రూపాయలు నుండి 2,05,400 రూపాయలు జీతం అందనుంది.

Website

Notification

కామెంట్‌లు లేవు: