తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
🟢– వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తాం. ఇందుకోసం రోజుకు 20 వేలు చొప్పున ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేశాం.
🟢– ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం సేవ బదులు తిరుప్పావై పఠనం జరగుతుంది.
🟢– శ్రీవారి ఆలయంలో డిసెంబరు 14 నుండి జనవరి 7వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి.
★ 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను ఆలయంలోని రంగనాయకుల మండపంలో 25 రోజుల పాటు శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
🟢– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30న ప్రణయకలహోత్సవం జరుగనుంది. శ్రీవారు తన దేవేరులతో కలిసి ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
🟢– తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదం అందిస్తామని సోషల్ మీడియాలో నకిలీ వెబ్‌సైట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులను కోరుతున్నాను.
🟢👉 శ్రీవారి భక్తులు టిటిడి వెబ్‌సైట్
www.tirupatibalaji.ap.gov.in ను మాత్రమే వినియోగించాలి.
🟢– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లోని గదులను డిసెంబరు 15వ తేదీ నుంచి భక్తులకు కేటాయిస్తాం.
🟢 డసెంబరు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో ఈ గదులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాం.
🟢– తిరుమలలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో పవిత్ర ఉద్యానవనాలు ఏర్పాటు చేయనున్నాం.
🟢– గోసంరక్షణ కోసం డిసెంబరు 7న విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయంలో,
◆ 10వ తేదీన హైదరాబాద్‌లోని శ్రీవారి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించాం.
🟢– డిసెంబరు 6 నుండి 10వ తేదీ వరకు తిరుమల శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించాం. శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు కవచ సమర్పణ జరిగిన తరువాత మహాసంప్రోక్షణ వరకు బాలాలయంలో స్వామివారికి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తాం.
🟢– టిటిడి కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు తిరుమల వసంత మండపంలో అశ్వత్థపూజ, సాలగ్రామ పూజ, రాధా దామోదర వ్రతం, తులసీ ధాత్రీ దామోదర వ్రతం, గోపూజ, విష్ణుపూజలు, వ్రతాలు నిర్వహిస్తోంది. తిరుపతి కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో 14 రోజుల పాటు శివపూజలు, త్రిలోచన గౌరీ వ్రతం, స్కంధ షష్టి, సంకష్టహర గణపతి వ్రతం, శివసోమవార వ్రతాలు నిర్వహిస్తున్నాం.
🟢– ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేయాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ నవంబరు 30వ తేదీన తిరుపతిలో కార్తీక మహా దీపోత్సవం, డిసెంబరు 11న విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహించాం. వేద వర్సిటీలోని ధ్యానారామంలో ప్రతిరోజూ ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తున్నాం. తిరుమల నాదనీరాజన వేదికపై కార్తీక మాస విశిష్టతను తెలిపే ప్రవచనాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను భక్తులు విశేషంగా ఆదరిస్తూ సందేశాలు పంపుతున్నారు.
🕉 *నవంబరులో నమోదైన వివరాలు*
🟢– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 8.47 లక్షలు
🟢– హుండీ కానుకలు – రూ.61.29 కోట్లు
🟢– తిరుమల శ్రీవారి ఇ-హుండీ కానుకలు – రూ.3.75 కోట్లు
🟢– విక్రయించిన లడ్డూలు – 50.04 లక్షలు
🟢– అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు – 8.99 లక్షలు
🟢– తలనీలాలు సమర్పించిన భక్తులు – 2.92 లక్షలు.
👉 ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ బాలాజి, శ్రీ నాగరాజ, శ్రీ దామోదరం, శ్రీ విజయసారథి శ్రీ సెల్వం, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, సిఎంఓ డాక్టర్ నర్మద, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ ప్రభాకర్, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
13, డిసెంబర్ 2020, ఆదివారం
TTD News తిరుమల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి